Advertisementt

ఇంత కాంపిటీషన్ లో సేఫ్ అయ్యేనా?

Sun 23rd Oct 2022 11:32 AM
ginna movie,manchu vishnu,box office  ఇంత కాంపిటీషన్ లో సేఫ్ అయ్యేనా?
Will it be safe in such a competition? ఇంత కాంపిటీషన్ లో సేఫ్ అయ్యేనా?
Advertisement
Ads by CJ

ఈ దివాళకి బాక్సాఫీసు దగ్గర బిగ్ ఫైట్ జరిగింది. భారీ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవ్వకపోయినా మీడియం బడ్జెట్ సినిమాలు పేరున్న సినిమాలు విడుదలయ్యాయి. దానితో కాంపిటీషన్ కనిపించింది. తెలుగులో ఓరి దేవుడా, జిన్నా, ప్రిన్స్, తమిళం నుండి సర్దార్ సినిమాలు నువ్వా - నేనా అని బాక్సాఫీసు ఫైట్ కి దిగగా.. అందులో ఓరిదేవుడా, సర్దార్, జనాలు మంచి టాక్ తెచ్చుకోగా.. ప్రిన్స్ డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే చాలారోజులుగా హిట్ కోసం ఎదురు చూసిన మంచు విష్ణుకి జిన్నా సక్సెస్ టాక్ ఊరటనిచ్చింది. అదే ఊపులో సక్సెస్ సెలెబ్రేషన్స్, ఇంటర్వూస్ అంటూ విష్ణు హడావిడి మొదలు పెట్టాడు.

కానీ ఆ సక్సెస్ ఆనందం జిన్నా కలెక్షన్స్ లో కనిపించడం లేదు. కారణం హెవీ కాపిటిషన్ జిన్నాని దెబ్బేసింది. జిన్నా గనక విడిగా రిలీజ్ అయ్యి ఉంటే ఎంతో కొంత లాభాలు వచ్చేవి. లాభాలు రాకపోయినా కనీసం నష్టాలూ అయినా తప్పేవి. కానీ ఇప్పుడు జిన్నా టాక్ కి కలెక్షన్స్ కి అస్సలు పొంతన లేదు. సర్దార్ థియేటర్స్ లో కాస్త సందడి కనిపిస్తుంటే.. ఓరి దేవుడా కి ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యలో ప్రిన్స్ ని లైట్ తీసుకున్న ఆడియన్స్ జిన్నా మీద దృష్టి పెట్టకపోవడానికి కారణం మంచు ఫ్యామిలీపై ఉన్న నెగిటివినే అంటున్నారు కొందరు. ఏమైనా జిన్నా సక్సెస్ మంచు ఫ్యామిలిలో ఆనందాన్ని నింపినా.. దానిని అనుభవించే రాత వారికి లేనట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి.

Will it be safe in such a competition?:

Ginna collections report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ