దీపావళి పండుగని అద్భుతమైన రీతిలో జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారంతా టపాకాయలని కాల్చుతూ, స్వీట్లని పంచుకుంటూ సంబరాలు చేసుకోడానికి సిద్ధమవుతున్నారు. సామాన్యుల మాదిరిగానే సెలబ్రిటీలు కూడా దీపావళి పండుగను టపాకాయలు పేల్చి జరుపుకుంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం దీపావళిని అందుకు విరుద్ధంగా జరుపుకోడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ప్రతి సంవత్సరం లానే, ఈ సారి కూడా అల్లు అర్జున్ దీపావళిని వినూత్న రీతిలో జరుపుకోనున్నారు. అల్లు అర్జున్ పేద పిల్లలకు మిఠాయిలు మరియు పటాసులు పంచిపెట్టడం ద్వారా దీపావళిని జరుపుకుంటాడు. అల్లు అర్జున్ తన చర్య ద్వారా పేద పిల్లలు, టపాకాయలు లేకుండా నిరాశపడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. అల్లు అర్జున్ తన ఆలోచనతో అందరి మన్ననలను అందుకుంటున్నాడు. పేదవారు కూడా దీపావళిని పటాసులు కాల్చి జరుపుకోవాలని అల్లు అర్జున్ సంకల్పాన్ని అందరూ కొనియాడుతున్నారు.
అల్లు అర్జున్ ప్రసుతం పుష్ప ది రూల్ సినిమాతో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. అసలు ప్రచారమే లేకుండా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పుష్పా ది రైజ్‌కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది మరియు ఇప్పటికి కూడా అతని మ్యానరిజమ్స్, డ్యాన్స్ మరియు డైలాగ్‌లను చాలా మంది ప్రముఖులు అనుకరిస్తున్నరు.