Advertisementt

బిగ్ బాస్ స్టేజ్ ని అల్లాడించిన హైపర్ ఆది

Sun 23rd Oct 2022 09:07 PM
bigg boss telugu 6,hyper aadi,big boss diwali special episode  బిగ్ బాస్ స్టేజ్ ని అల్లాడించిన హైపర్ ఆది
Hyper Aadi rocked the Bigg Boss 6 stage బిగ్ బాస్ స్టేజ్ ని అల్లాడించిన హైపర్ ఆది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం ఆదివారం దివాళి సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆరు గంటలకు మొదలైన దివాళి ఎపిసోడ్ డల్ గా మొదలయ్యింది. కొంతమంది స్పెషల్ డాన్స్ లు అంటూ స్టేజ్ పై ధనాధన్ అంటున్నా పెద్దగా ఎవరికీ ఊపు రాలేదు. శ్రీరామ్ చంద్ర పాట కూడా కిక్ ఇవ్వలేదు. ఇక హౌస్ మేట్స్ కూడా ఏదో రెడీ అయ్యి కూర్చున్నారు. కానీ జబర్దస్త్ టాప్ కమెడియన్ హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడో.. లేదో.. ఈ దివాళి ఎపిసోడ్ కళ మొత్తం మారిపోయింది. స్టేజ్ పైన నవ్వులే నవ్వులు, బిగ్ బాస్ హౌస్ లోను నవ్వులే.. హోస్ట్ నాగార్జున అయితే పడి పడి నవ్వెంత పంచ్ లతో ఆది నిజంగా అల్లాడించాడు.

బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి సున్నితంగా ఏమేం చేస్తున్నారో, వాళ్ళేమాడుతున్నారో చెబుతూనే అందులో కామెడీ మిక్స్ చేసి మరీ అందరిని నవ్వించేసాడు. గీతు నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావ్, కేవలం మైండ్ గేమ్ మాత్రమే కాదు.. టాస్క్ లో ఫిజికల్ గా బాగా ఆడు అని చెప్పాడు. ఆది రెడ్డి నీ డాన్స్ హాట్ స్టార్ లో చూసుకుంటే భయపడతావ్ అన్నాడు. ఇక రేవంత్ నీయవ్వ తగ్గేదే లే అంటూ ప్రకాష్ రాజ్ ని చూపించావ్ అంటూ ఫన్ చేసాడు. ఇక అర్జున్ ని అయితే ఎడా పెడా శ్రీసత్య విషయంలో ఆడేసుకున్నాడు. వాసంతి నువ్వు దెయ్యం గెటప్ లోను మేకప్ తో మమ్మల్ని సంతోష పెట్టి లైన్ వేసుకునేలా చేసావ్, అమ్మ శ్రీ సత్య నీ కోసమే టివిలు చూసే యూత్ ఉన్నారు అన్న హైపర్ ఆది ఫైమా ని నిన్ను ప్రవీణ్ అడిగాడు అనగా.. నేను కూడా అడిగాను అని చెప్పు అనేలోపు నిన్ను అడిగింది అతనికి నువ్వు పది వేలు ఇవ్వాలంట కదా అంటూ అటు హోస్ట్ నాగార్జునని నవ్వించేసాడు ఆది. 

అంతేకాకుండా హౌస్ లో నామినేషన్స్ అప్పుడు తుప్పాసి రీజన్స్ తో నామినేట్ చెయ్యకండి, గేమ్ ఆపేద్దామని ట్రై చేస్తున్నారు, కానీ ఆపకండి ఆడండి అంటూ క్లాస్ ఇచ్చాడు. హైపర్ ఆది ఉన్న టైం మొత్తం బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేసే ఉంటారు. అంతలాంటి కామెడీతో హైపర్ ఆది దివాళి ఎపిసోడ్ కి ఊపిరి పోసాడనే చెప్పాలి.

Hyper Aadi rocked the Bigg Boss 6 stage:

Bigg Boss Telugu 6: Diwali special episode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ