ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, జన సేనాని పవన్ కళ్యాణ్ కి నోటీసులు జారీ చేస్తూ మహిళలని కించపరిచినందుకు సమాధానం ఇవ్వాలని కోరింది. పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్ల మీద వైసిపి నేతలు అవాకులు చవాకులు పేలుతుండటంతో, తానేమీ మహిళలని మోసం చేయలేదని, వారికి చట్టపరంగా విడాకులు ఇచ్చిన తర్వాతే, మరో పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. అయినా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ మాటలకి సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపింది.
పవన్ కళ్యాణ్ కి నోటీసులు జారీ జేయడం పై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. అందరూ మహిళా కమిషన్ చైర్మన్ కి అసలు నిజాలు తెలియలేదా అని అడుగుతున్నారు. వైసిపి నేతలు, పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి పై, అలానే చంద్రబాబు భార్య భువనేశ్వరి పై, ఇంకా లోకేష్ పుట్టుక పై, నిండు అసెంబ్లీలో బూతు పురాణం సాగిస్తున్నప్పుడు, ఈ మహిళా కమిషన్ ఏమైందని అడుగుతున్నారు.
అదే విధంగా వైసిపి నాయకులు తమ నియోజకవర్గాలలో లోకేష్ పుట్టుక పై అశ్లీల, అసభ్యకరమైన ఫ్లెక్సీలు పెట్టినప్పుడు, వాసి రెడీ పద్మకి ఈ వావి వరసలు తెలియలేదా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి నోటీసులు పంపిన మహిళా కమిషన్, జగన్ మోహన్ రెడ్డి మరియు అతని మంత్రులకు వారి అడ్డమైన బూతు పురాణాలకు ఎందుకు నోటీసులు పంపలేదని, ఆ సమయంలో మహిళా కమిషన్ నిద్రపోయిందా అని అడుగుతున్నారు. అవునులే, మరి అవి బూతు పురాణాలు కదా అందుకే శ్లాఘనీయాలు. అందుకే జగన్ గారి మాటలకు అర్థాలే వేరులే.