Advertisementt

డీజే టిల్లు 2 టైటిల్ వచ్చేసింది

Mon 24th Oct 2022 03:24 PM
dj tillu,tillu square,siddhu jonnalagadda,anupama parameswaran  డీజే టిల్లు 2 టైటిల్ వచ్చేసింది
DJ Tillu is titled Tillu Square డీజే టిల్లు 2 టైటిల్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన డీజే టిల్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సిద్ధుతో  డీజే టిల్లు సీక్వెల్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే డీజే టిల్లు సీక్వెల్ స్టార్ చేసేసారు. డీజే టిల్లు సీక్వెల్ కి టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. టిల్లు స్క్వేర్  దీపావళి సందర్భంగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్ లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. 

టిల్లు స్క్వేర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాక్సాఫీస్ దగ్గర డీజే టిల్లు సంచలనం సృష్టించిన ఏడాదికే 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో సందడి చేయనుంది. టిల్లు స్క్వేర్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ దీపావళి కానుకగా ఒక ప్రత్యేక వీడిమోని విడుదల చేసింది చిత్ర బృందం. అందులో టిల్లు మద్యం  మత్తులో ట్రాఫిక్ పోలీస్ తో వాదన పెట్టుకోవడం నవ్వులు పూయించింది. తాను హీరోనని, తన పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకుందాం అనుకుంటే డేట్స్ ఖాళీగా లేవని చెప్పడం అలరించింది. రెండు నిమిషాల నిడివి గల వీడియోతో సీక్వెల్ లో డీజే టిల్లుని మించిన వినోదాన్ని పంచబోతున్నారని చెప్పకనే చెప్పేశారు.

స్టార్ బోయ్ సిద్దు వాచికాభినయాలు మరోసారి వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి.

DJ Tillu is titled Tillu Square:

The sequel of the super-hit entertainer DJ Tillu is titled Tillu Square

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ