ఉప్పెన తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఎన్టీఆర్ ని సెకండ్ సినిమా కోసం కమిట్ చేయించి.. ఇప్పటికి ఎన్టీఆర్ సినిమా కథపైనే పని చేస్తున్న దర్శకుడు బుచ్చి బాబు ఎన్నాళ్లని, ఎన్నేళ్ళని ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉంటాడు. అప్పుడే ఉప్పెన విడుదలై రెండేళ్లు కావొస్తున్నా బుచ్చిబాబు నుండి సెకండ్ మూవీ అనౌన్సమెంట్ రాలేదు. ఎన్టీఆర్ తో మూవీ చెయ్యాలనే సంకల్పంతో బుచ్చిబాబు మరో హీరోని వెతకలేదు. తీరా ఎన్టీఆర్ కొరటాలతో మూవీ ఇంకా మొదలు పెట్టలేదు. అది మొదలు పెట్టినా.. తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా.. ఇలా ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి.. 2024 పూర్తవడం ఖాయం.
అంటే బుచ్చి బాబు మరో రెండేళ్లు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. మరి నిజంగా బుచ్చి బాబు ఎన్టీఆర్ తో పెట్టుకుంటే చాలా కష్టం. ఆయనతో సినిమా చెయ్యడం అటుంచి.. టైమ్ వెస్ట్ కాకుండా మరో హీరోని వెతుక్కుంటే బెటర్. లేదంటే మళ్ళీ రెండేళ్లు సమయం వృధా. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు మరోసారి మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టి మెగా హీరోతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే మాట ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.