Advertisementt

సూపర్ స్టార్ కి నచ్చేసిన కాంతార

Wed 26th Oct 2022 04:24 PM
rishab shetty,kantara movie,rajinikanth  సూపర్ స్టార్ కి నచ్చేసిన కాంతార
Rajinikanth calls Kantara a masterpiece సూపర్ స్టార్ కి నచ్చేసిన కాంతార
Advertisement
Ads by CJ

కన్నడలో అంచనాలు లేకుండా విడుదలై ప్రస్తుతం ఇండియా వైడ్ గా అందరూ మట్లాడుకునేలా చేసి.. కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులని సృష్టిస్తున్న కాంతార కి ప్రముఖుల నుండి అపూర్వ స్పందన వస్తుంది. కోలీవుడ్ నుండి బాలీవుడ్, టాలీవుడ్ వరకు కాంతారని పొగిడిన వారే కానీ.. పొగడని వారు లేరు. కాంతార క్లైమాక్స్, చివరి 20 నిముషాలు సినిమా ని ఆకాశంలో నిలబెట్టింది. గూస్ బంప్స్ తెప్పించాయంటూ సెలబ్రిటీస్ కాంతారని పొగిడేస్తుంటే.. ఆడియన్స్ కలెక్షన్స్ రూపేణా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. 

తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంతారని వీక్షించడమే కాదు, హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి ని ఓ రేంజ్ లో పొగిడేశారు. కాంతార ని చూసిన రజినీ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. తెలిసిన దానికంటే తెలియనిది ఎక్కువ, ఇంతకంటే బాగా సినిమాల్లో ఎవరూ చెప్పలేరు. కాంతార నాకు గూస్ బంప్స్ ఇచ్చింది. రిషబ్ శెట్టి మీరు రైటర్ గా, దర్శకుడిగా, హీరోగా సూపర్బ్, హ్యాట్సాఫ్. ఈ అద్భుత కళాఖండంలో నటించిన నటులకి అలాగే టెక్నీకల్ టీమ్ కి అభినందనలు అంటూ.. ఫైనల్ గా కాంతారని మాస్టర్ పీస్ అంటూ అభివర్ణిస్తూ సూపర్ స్టార్ ట్వీట్ చేసారు. 

Rajinikanth calls Kantara a masterpiece:

Rishab Shetty Kantara Reviewed By Rajinikanth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ