Advertisementt

అసలు విషయం బయటపెట్టిన సమంత

Sat 29th Oct 2022 03:48 PM
samantha,autoimmune condition myositis  అసలు విషయం బయటపెట్టిన సమంత
Samantha reveals she has autoimmune condition Myositis అసలు విషయం బయటపెట్టిన సమంత
Advertisement
Ads by CJ

కొన్నిరోజులుగా సమంత సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్ అప్పీరియన్స్ కానీ ఇవ్వడం లేదు. సమంత పై రకరకాల వార్తలు సోషల్ మీడియాని కమ్మేశాయి. ఆమె అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది అంటూ న్యూస్ లు వినిపించాయి. తాజాగా ఆమె విదేశాలకు వెళ్ళింది కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి అని, ఆమె తన శరీరంలోని ఓ భాగానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక సమంత రీసెంట్ లుక్ పై కూడా పలు రకాల కామెంట్స్ వినిపించాయి. దీనితో సమంత ఆరోగ్యంపై అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా యశోద ట్రైలర్ లాంచ్ కి కూడా సమంత హాజరుకాకపోవడంపై ఈ అనుమానాలు బలపడడానికి కారణమయ్యాయి.

అయితే సమంత తన ఆరోగ్యం విషయంలో అసలు నిజాలు చెప్పింది. తన ఇన్స్టా స్టోరీస్ లో తాను ఓ వ్యాధితో పోరాడుతున్నట్టుగా చెప్పి షాకిచ్చింది. యశోద ట్రైలర్ పై వచ్చిన పాజిటివ్ కామెంట్స్ తనకి బలాన్నిచ్చాయని, ఈ ప్రేమే తన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అని, కొన్ని నెలల క్రితం నుండి తాను మేమైసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నాని, దీని నుండి కోలుకున్నాకే మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకున్నాను, కానీ నేను అనుకున్నదానికంటే ఈ వ్యాధి నయమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మనం ఎంతో నమ్మకంతో ముందడుగు వెయ్యాలి. ఈ వ్యాధి నుండి త్వరగా కోలుకుంటాను అని డాక్టర్స్ చెబుతున్నారు. వారు కూడా నేను త్వరగా కోలుకుంటాను అని నమ్ముతున్నారు. నాకు మంచి రోజులతో పాటుగా, చెడు రోజులు కూడా ఉన్నాయి. మానసికంగా శరీరకముగా అలిసిపోయి ఇక భరించలేను అనుకున్న క్షణాలను దాటాను.. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను అంటూ సమంత తన వ్యాధి విషయంలో అసలు నిజాన్ని బయటపెట్టింది. 

సమంత ఆ పోస్ట్ తో పాటుగా.. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిక్ ని షేర్ చేసింది. దానితో ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమెకి ధైర్యాన్ని ఇస్తున్నారు.

Samantha reveals she has autoimmune condition Myositis:

Samantha opens up on suffering from autoimmune condition

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ