మెగా ఈవెంట్స్ కి మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరైనా మెగాస్టార్ చిరు నే పెద్దగా భావించి గెస్ట్ గా పిలుస్తారు. అల్లు అర్జున్ దగ్గరనుండి రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్ ఇలా ఎవ్వరైనా చిరుని చూజ్ చేసుకుంటారు. అటు పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ.. ఆయన సినిమాలు, రాజకీయాలతో బిజీ కాబట్టి.. మెగా పెద్దగా చిరుని గౌరవిస్తారు. ఇప్పుడు అదే పెద్ద స్థానాన్ని మెగా ఫ్యామిలిలో అల్లు అరవింద్ గారు బాలయ్య కి ఇస్తున్నారా అనిపిస్తుంది. అల్లు వారి ఆహా అన్ స్టాపబుల్ కోసం ఏరి కోరి నందమూరి నటసింహం బాలకృష్ణకి తీసుకొచ్చి ఆహా ఓటిటీని జనాల్లోకి పంపిన అరవింద్ తెలివితేటలని పొగిడినవారే కానీ పొగడని వారు లేరు.
ఇప్పుడు సినిమాలకి గ్యాప్ ఇచ్చి కొత్త సినిమాతో రాబోతున్న చిన్న కొడుకు శిరీష్ ని ప్రేక్షకుల్లోకి లోకి బలంగా తీసుకెళ్లాలి అంటే నందమూరి అభిమానులని కూడా పడెయ్యాలనే ప్లాన్ చేసాడు అరవింద్. అల్లు శిరీష్ ఉర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరుని తీసుకొస్తారనుకుంటే.. అనూహ్యంగా బాలక్రిష్ణని గెస్ట్ గా పిలిచి సర్ ప్రైజ్ ఇచ్చారు అరవింద్. అంటే ఇక మీద చిరు ప్లేస్ లో బాలయ్యని పెడతారా ఏమిటి అనే అనుమానాలు అల్లు ఫాన్స్ లోనే కాదు, మెగా ఫాన్స్ లో కూడా మొదలయ్యింది. అల్లు అరవింద్ వేసే ప్లాన్స్ చాలాసార్లు చాలామందికి అర్ధం కాకపోయినా.. ఆయనకి ఆ ప్లాన్స్ వర్కౌట్ అయ్యి లాభాలు తెచ్చిపెడతాయి. అందులో భాగమే ఆహాలో బాలయ్యని దింపడం. మరి చిన్న కొడుకు శిరీష్ కోసం బాలయ్య వస్తున్నాడంటే.. ఎంతవరకు పని జరుగుతుందో చూడాలి.