Advertisementt

కూతురితో అల్లు అర్జున్ నైట్ రైడ్

Tue 01st Nov 2022 05:54 PM
allu arjun,night ride,allu arha  కూతురితో అల్లు అర్జున్ నైట్ రైడ్
Allu Arjun night ride with daughter Arha కూతురితో అల్లు అర్జున్ నైట్ రైడ్
Advertisement
Ads by CJ

పుష్ప తో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ కోసం నార్త్ ప్రేక్షకుల్లో ఎంతో క్రేజీగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 2 ఎప్పుడొస్తుందా.. పుష్ప రాజ్ ఇంకెంత సర్ ప్రైజ్ ఇస్తాడో అంటూ వారంతా ఆతృతగా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ చెయ్యకుండా.. ప్రస్తుతం యాడ్ షూట్స్, మధ్యలో ఫ్యామిలీతో వెకేషన్స్ అంటూ బిజీగా వున్నాడు. తాజాగా తన కూతురు అర్హ తో అల్లు అర్జున్ నైట్ రైడ్ కి వెళ్ళిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కూతురు అర్హతో అల్లు అర్జున్ ఫన్ నైట్ రైడ్ పిక్ వైరల్ అయ్యింది.

ఆ కారులోనే అల్లు అర్జున్ కూతురు అర్హ టిఫిన్ చేస్తూ ఉండగా.. ఆయన భార్య స్నేహ క్లిక్ మనిపించారు. ఇంతకుముందు కూడా అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో నైట్ షికారుకు వెళుతుంటాడు. రీసెంట్ గా అల్లు అర్హ తనకి బయట ఫుడ్ కావాలని అడగ్గా.. అల్లు అర్జున్ ఇలా బయటికి తీసుకువచ్చాడని అంటున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ డ్రైవింగ్ లో ఉండగా.. అర్హ దోశ తింటున్న పిక్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Allu Arjun night ride with daughter Arha:

Allu Arjun Enjoyed A Night Ride With His Daughter 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ