Advertisementt

సుడిగాలి సుధీర్ రేంజ్ ఆహా తో మారుతుందా ?

Wed 02nd Nov 2022 12:03 PM
sudigali sudheer,aha comedy show  సుడిగాలి సుధీర్ రేంజ్ ఆహా తో మారుతుందా ?
Will the Sudhir range change with Aha? సుడిగాలి సుధీర్ రేంజ్ ఆహా తో మారుతుందా ?
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్ గా ఈటీవీలో విపరీతంగా పాపులర్ అయిన సుధీర్ ఇప్పుడు ఈటీవిని వదిలేసాడు. ఈటీవీలో ఢీ డాన్స్ షో, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ కామెడీ చేస్తూ అదరగొట్టేసాడు. జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా వెండితెర మీద అవకాశాలు అందిపుచ్చుకోవడమే కాదు, హీరోగా మారాడు. బుల్లితెర మీద సూపర్ సక్సెస్ అయిన సుధీర్ కి హీరో గా అనుకున్న సక్సెస్ అయితే దక్కలేదు. ఇక జబర్దస్త్ నుండి, ఈటివి నుండి బయటికి వచ్చేసిన సుధీర్ ఇతర ఛానల్స్ లో యాంకరింగ్ చేసాడు. కానీ అక్కడంత పాపులారిటీ ఈ షోస్ లో కనిపించలేదు. దానితో సుడిగాలి సుధీర్ రేంజ్ పూర్తిగా పడిపోయింది అంటూ ఆయన అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. 

సుధీర్ రేంజ్, ఆయన క్రేజ్ తగ్గిపోతుంది. అటు సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ఇటు బుల్లితెర మీద సక్సెస్ రేట్ తగ్గింది అంటూ ఆందోళనలో ఉన్నారు సుధీర్ ఫాన్స్.  ఇప్పుడు ఆహా ఓటిటి కోసం ఓ కామెడీ షో చేస్తున్నాడు సుధీర్. ఆహా కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కావాలనే అల్లు అరవింద్ పిలిచి మరీ సుడిగాలి సుదీర్ కు ఈ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీని కోసం సుధీర్ కి భారీగా పారితోషకం సెట్ చేసినట్లుగా తెలుస్తుంది. జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి రెండు లక్షలు తీసుకునే సుధీర్ కి ఆహా కామెడీ షోకి అంతకంటే ఎక్కువ స్థాయిలోనే మూడు లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. మరి ఈ డిజిటల్ ఎంట్రీ తో సుధీర్ క్రేజ్, రేంజ్ మరిపోతాయని అభిమానులు ఆశపడుతున్నారు.

Will the Sudhir range change with Aha?:

Sudigali Sudheer received Fat Check For Aha Comedy Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ