మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 న దసరా ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి ఆదరణ పొందింది. మలయాళ హిట్ ఫిలిం లూసిఫెర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ ని చూడడానికి తెలుగు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో సినిమా హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా ఆయన పెరఫార్మెన్స్, నయనతార రోల్, ముఖ్యంగా సత్య దేవ్ విలనిజం ఆకట్టుకున్నాయి. అయితే అక్టోబర్ 5 న విడుదలైన గాడ్ ఫాదర్ కి హిట్ టాక్ సొంతమైన అనుకున్న కలెక్షన్స్ రాలేదనే చెప్పాలి. అందుకే ఈ మూవీ కొద్దిగా ఎర్లీ గానే ఓటిటి రిలీజ్ కి సిద్ధమైంది.
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ 56 కోట్ల భారీ డీల్ తో తో గాడ్ ఫాదర్ హక్కులని దక్కించుకున్నట్లుగా టాక్ ఉంది. అయితే గాడ్ ఫాదర్ ని ఈ నెల 19 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అదే రోజు అంటే అక్టోబర్ 5 నే విడుదలైన ద ఘోస్ట్ ఈ రోజు నుండే నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రాగా.. హిట్ టాక్ సొంతం చేసుకున్న గాడ్ ఫాదర్ ఈ నెల అంటే నవంబర్ 19 నుండి అందుబాటులోకి రానుంది.