Advertisementt

కాంతార ఓటిటి డేట్ ఫిక్స్

Fri 04th Nov 2022 11:39 AM
kantara movie,kantara ott date locked  కాంతార ఓటిటి డేట్ ఫిక్స్
Kantara OTT date locked కాంతార ఓటిటి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

కన్నడ నుండి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి దుమ్మురేపిన కాంతార తర్వాత పాన్ ఇండియా లో విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్ అవడం కాదు, సూపర్ డూపర్ కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. తెలుగులో అయితే గాడ్ ఫాదర్ కి చుక్కలు చూపించింది. చిరు నటించిన గాడ్ ఫాదర్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టినా.. తర్వాత వారం కాంతార విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది. గాడ్ ఫాదర్ కలెక్షన్స్ ని వెనక్కి నెట్టేసి కాంతార కదం తొక్కింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 50 కోట్ల మార్క్ ని టచ్ చేసిన కాంతార హిందీలో 50 కోట్లకి చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల టార్గెట్ సెట్ చేసేలా కనబడుతుంది. 

గత నెలలో విడుదలైన ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో విజయ్ దుందుభి మోగించడంతో.. ఈ సినిమా ఓటిటి రిలీజ్ లేట్ అవుతుంది. అసలైతే ఈపాటికే కాంతార ఓటిటి నుండి రిలీజ్ కావాల్సి ఉంది. అంటే నవంబర్ మొదటి వారంలోనే కాంతార అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇంకా థియేట్రికల్ రన్ పూర్తి కాకపోవడంతో.. ఓటిటి రిలీజ్ డేట్ వాయిదా పడింది. థియేటర్లలో ఇప్పటికీ మూవీ రన్ అవుతూ కలెక్షన్స్ తెస్తుండడంతో.. ఈ నెల 18 వరకు ఓటిటి రిలీజ్ కి ఆగాలని కాంతార ప్రొడ్యూసర్ అమెజాన్ ప్రైమ్ ని కోరినట్లు తెలుస్తోంది. దానికి అమెజాన్ కూడా అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి బ్లాక్ బస్టర్ మూవీ కాంతారని ఓటీటీలో చూసేందుకు ఈ నెల 18 వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే.

Kantara OTT date locked:

Kantara OTT release date locked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ