బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోలో సెలబ్రిటీస్ ముచ్చట్లే కాదు, మధ్య మధ్యలో బాలకృష్ణ ముచ్చట్లు, ఆయన వ్యక్తిగత విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. ఈ వారం బాలయ్య షో కి కుర్ర హీరోలు శర్వానంద్, అడివి శేష్ లు వచ్చారు. అడివి శేష్ ని నువ్వు నీ సినిమాల్లో ఫస్ట్ కిస్ ఎవరికిచ్చావ్ అనగానే ఆదా శర్మ అన్నాడు. లాస్ట్ కిస్ మూవీ అనగానే హిట్ 2 మీనాక్షి చౌదరి అంటూ టక్కున చెప్పాడు. అయినా వదలని బాలయ్య నువ్ ఫ్యూచర్ లో కిస్ చేయాలనుకుంటున్న హీరోయిన్ ఎవరు అనగానే కాస్త అలోచించి కత్రినా కైఫ్ అన్నాడు. అస్సలు కిస్ చెయ్యననుకుంటున్న హీరోయిన్ ఎవరు అనగానే అలియా భట్ అన్నాడు. శర్వా అదేమిటి అలియానా అంటూ అమాయకంగా చూడగానే మొన్నేకదా పెళ్ళైంది అన్నాడు శేష్.. మరి కత్రినాకి పెళ్ళవలేదా అని ఆటపట్టించాడు.
అయితే బాలయ్య ని మీ మూవీస్ లో లిప్ లాక్ కిస్ ఎవరితోనైనా చేసారా అని అడిగారు ఇద్దరు హీరోలు. దానికి బాలయ్య తన బొబ్బిలి సింహం సినిమా ఓపెనింగ్ లో జరిగిన ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసారు. బొబ్బిలి సింహం మూవీ ఓపెనింగ్ వేమూరు గుట్టపైన జరుగుతుంది. పక్కనే రజినీకాంత్-మీనా షూటింగ్ చేస్తున్నారు. అక్కడున్న వారంతా మా ఓపెనింగ్ వచ్చారు. రజినీకాంత్ క్లాప్ కొట్టారు. నేను సీరియస్ గా డైలాగ్ చెబుతున్నా.. తరవాత ఔట్ ఫీల్డ్ నుంచి మీనా వచ్చి నా బుగ్గ మీద ముద్దుపెట్టమన్నారు. డైలాగ్ అయిపోయింది. మీనా వచ్చింది.. కానీ ఆవిడ రావడం కాస్త లేటైంది. ఏంట్రా ఇంకా రాలేదు అని ఇటు తిరిగా (లిప్ లిప్ దగ్గరికొచ్చాయి) కెవ్వుమని అరిచింది మీనా.. అంటూ బాలయ్య తనకి జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ని అన్ స్టాపబుల్ టాక్ షోలో ఆ హీరోలతో పంచుకున్నారు.