మలయాళ బ్యూటీ సాయి పల్లవి.. ఈ టివిలో వచ్చిన ఢీ డాన్స్ షోలో డాన్సర్ గా ఫెమస్ అయ్యి తర్వాత కన్నడ డాన్స్ షోస్ లోను పాపులర్ అయ్యాకే హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఆమెకి డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే డాన్స్ కాంపిటీషన్స్ కి ఎక్కువగా అటెండ్ అవుతుండేది. అలాంటి డాన్స్ షోస్ పై సాయి పల్లవి తాజాగా సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గత ఏడాది లవ్ స్టోరీ, శ్యామ్ సిగ్ రాయ్ తో అదరగొట్టేసింది సాయి పల్లవి. ఈ ఏడాది విరాట పర్వంతో పెరఫార్మెన్స్ పరంగా బెస్ట్ అనిపించుకుంది. కాని తర్వాత ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. మరోపక్క తమిళంలో కమల్ సినిమాలో నటిస్తుంది.
అయితే తాజాగా సాయి పల్లవి డాన్స్ షోస్ పై మట్లాడుతూ.. డాన్స్ పోటీల్లో ప్రతిభకి చోటు లేదని, గౌరవం లేదని కేవలం డబ్బుంటేనే డాన్స్ లో గౌరవం ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. టివి ఛానల్స్ లో ఏ ప్రోగ్రాం జరిగినా డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని, లేదంటే సెలెబ్రిటీ కిడ్స్ కి అంత గౌరవం దక్కుతుంది అని, అందుకే తనకి డాన్స్ కాంపిటీషన్స్ అంటే అస్సలు ఇష్టం, నమ్మకం ఉండదని, అవంటే తనకి అస్సహ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే సాయి పల్లవి ఈ వ్యాఖ్యలు చెయ్యడానికి కారణం.. తమిళంలో విజయ్ టివిలో వచ్చిన డాన్స్ షో లో తనకి రెండో బహుమతి రావడంపై ఆమె బాగా ఫీలై ఇలా మాట్లాడింది అంటున్నారు. ఆ షో లో ఫస్ట్ స్థానంలో ఉండాల్సిన తాను డబ్బు ముందు ఓడిపోయాను అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.