మెగాస్టార్ చిరంజీవి వయసుకి తగిన పాత్రలు ఎంచుకుంటూ మరికొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలని మెగా ఫాన్స్ తపన పడుతున్నారు. ఖైదీ నెంబర్ 150 రీమేక్ గనక సరిపోయింది. ఆ సినిమాలో యంగ్ హీరోయిన్ కాజల్ తో కలిసి స్టెప్స్ వేశారు ఓకె.. తర్వాత ఆచార్య లో ఐటమ్ సాంగ్ అంటూ మరీ చిన్న పిల్ల రెజీనాతో మెగాస్టార్ కాలు కదపడం ప్రేక్షకులకి అస్సలు రుచించలేదు. గాడ్ ఫాదర్ అంటూ ఆయన వయసుకి తగిన హుందా పాత్రతో మెగాస్టార్ చిరు అదరగొట్టేసారు. ఇందులోనూ ఫాన్స్ కోసం చిరు స్టెప్స్ వేశారు. ఏదో అలా అలా సల్మాన్ తో కాలు కదిపారు ఓకె..
కానీ వాల్తేర్ వీరయ్యలో మాస్ కి నచ్చే మెచ్చే ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. అందులో చిరు రవితేజ కలిసి స్టెప్స్ వెయ్యబోతున్నారు. కానీ ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటమ్ హీరోయిన్ గా కనబడబోతుంది. మరి ఉర్వశితో స్పెషల్ సాంగ్ అంటే.. చిరు కూడా అంతకు మించి అనేలా డాన్స్ చెయ్యాలి. కానీ చిరుకి ఈ వయసులో ఇవ్వన్నీ అవసరమా అని కొందరు అంటుంటే.. వయసు కాదు, హుందాతనం ఉట్టిపడే పాత్రలు సెలెక్ట్ చేసుకోవాల్సిన చిరు ఇంకా మాస్ మాస్ అంటూ అనవసరంగా రిస్క్ చెయ్యడం ఎందుకు అంటున్నారు. యాక్షన్ ఓకె కానీ, హీరోయిన్స్ తో చిందులు అక్కర్లేదు అనేది కొంతమంది వాదన. చిరు ఈ వయస్సు లో కూడా ఇంత ఎనర్జీతో ఐటం సాంగ్స్ ఓకే చెప్పారంటే.. సాంగ్ ఎలా వున్నా ఆయన డెడికేషన్ కి, కమిట్మెంట్ కి ఫిదా అవ్వాల్చిందే.. మరి.