Advertisementt

రష్మీకి జబర్దస్త్ షాక్

Sat 05th Nov 2022 12:54 PM
sowmya rao,rashmi gautham,jabardasth comedy show  రష్మీకి జబర్దస్త్ షాక్
Jabardasth shock for Rashmi రష్మీకి జబర్దస్త్ షాక్
Advertisement
Ads by CJ

అనసూయ జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పగానే ఎవరో కొత్త యాంకర్ జబర్దస్త్ స్టేజ్ పై అందాలు ఆరబోస్తారు అనుకుంటే.. అనూహ్యంగా ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ నే గురువారం ఎపిసోడ్ లోకి దింపారు. అది చూసిన బుల్లితెర ప్రేక్షకులు, కామెడీ ప్రియులు బాగా డిస్పాయింట్ అయ్యారు. అనసూయ అంత అందం కానీ, ఆమె అంత వాక్చాతుర్యం కానీ లేని రష్మీ నే వారానికి రెండు సార్లు చూడాలంటే బోర్ కొడుతోంది అన్నారు. అసలే సుధీర్ లేడు, ఈమధ్యన చలాకి చంటి, ఫైమా వెళ్లిపోయారు. అదిరే అభి, అవినాష్ లాంటి వాళ్ళు ఎప్పుడో వెళ్లిపోవడంతో.. జబర్దస్త్ లో కామెడీ కోసం కష్టాలు పడుతున్న టైం లో మల్లెమాలకి ఈ యాంకర్ విషయమై నెగెటివిటి తట్టుకోవడం కష్టమైంది.

మరి ఈ క్రమంలోనే రష్మీకి జబర్దస్త్ షాక్ ఇచ్చి.. కొత్త యాంకర్ ని తీసుకువచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే వచ్చే వారం రష్మీ స్థానంలో సీరియల్ ఆర్టిస్ట్ సౌమ్య రావు జబర్దస్త్ స్టేజ్ పై యాంకర్ గా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అంటే రష్మీ ప్లేస్ లోకి సౌమ్య రావు ని తీసుకొచ్చారేమో.. ఇకపై సౌమ్య రావు యాంకర్ గా జబర్దస్త్ కి రాబోతుంది అంటున్నారు. అయితే సౌమ్య రావు తమిళ అమ్మాయి. ఆమె తెలుగులో శ్రీమంతుడు సీరియల్ లో గ్లామర్ గా విలనిజాన్ని చూపిస్తుంది.. ఆమె కూడా వచ్చిరాని తెలుగుతో, కేవలం గ్లామర్ తో జబర్దస్త్ ని ఎలా మ్యానేజ్ చేస్తుందో చూడాలి. మరి రష్మీ కూడా వచ్చిరాని తెలుగుతోనే ఫెమస్ అయ్యి ఇన్ని రోజులు మ్యానేజ్ చేసింది. ఇప్పుడు ఈ సౌమ్య రావు ఏం చేస్తుందో చూడాలి.

Jabardasth shock for Rashmi:

Serial Actress Sowmya Rao Replaced Rashmi Gautham In Jabardasth Comedy Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ