బిగ్ బాస్ సీజన్ 6 లో ఏం జరుగుతుందో.. వారం వారం ఎవరు బయటికి వెళుతున్నారో అర్ధం కాక బుల్లితెర ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఎలిమిషన్స్ లో చంటి, నేహా చౌదరి ముఖ్యంగా సూర్య ఎలిమినేషన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. మెల్లగా చిన్నగా క్రేజ్ తెచ్చుకుంటున్న వాసంతి, మరీనా, రాజ్ ల ముందు వీరు చాలా స్ట్రాంగ్ కానీ.. వీరి ఎలిమినేషన్ మాత్రం ఇంకా ఇంకా షాక్ ఇస్తున్న టైమ్ లో తొమ్మిదో వారం ఎలిమినేషన్ మరింత షాక్ కలిగించింది. హౌస్ లోకి కాలు పెట్టినప్పటి నుండి తానేమిటో, తన ప్రత్యేక ఏమిటో చూపించే ప్రాసెస్ లో బిగ్ బాస్ నే ఎదిరిస్తున్న గీతూ రాయల్ ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా లీకులు బయటికి రావడం ఆమె ఫాన్స్ కి పిచ్చ షాకిచ్చింది.
తొమ్మిదో వారం ఎలిమినేషన్స్ ప్రక్రియ పూర్తయినట్టుగా తెలియడం, అందులో గీతూ ఎలిమినేట్ అయ్యింది అంటూ లీకులు బయటకొచ్చేశాయి. దానితో బుల్లితెర ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. ఎంతో కొంత ఈ సీజన్ నడుస్తుంది అంటే గీతూ టాకింగ్ పవర్ వల్లే అని, కాకపోతే టాస్క్ పరంగా ఆమె స్ట్రాటజీలకి బిగ్ బాస్ కూడా తెల్లబోయాడు. బిగ్ బాస్ చెప్పినా వినను, నేను వెధవని, నేను దొంగని, నేను వెధవన్నర వేధనవి అని చెప్పుకుంటూ తిరిగే గీతూ రాయల్ కి బిగ్ బాస్ బిగ్ షాకిచ్చాడు. అయితే గీతూ ఎలిమినేషన్ ఫేక్ అని, ఆమె సీక్రెట్ రూమ్ కి వెళ్లొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. లేదంటే ఇంకా ఆరు వారాలు గేమ్ ఉండగా.. గీతూ లాంటి కంటెస్టెంట్ ని అవుట్ చేసే అవకాశమే లేదు అంటున్నారు.