Advertisementt

విడాకులు తీసుకోబోతున్న మరో సెలెబ్రిటీ జంట

Mon 07th Nov 2022 05:45 PM
sania mirza,shoiab malik  విడాకులు తీసుకోబోతున్న మరో సెలెబ్రిటీ జంట
Sania Mirza-Shoiab Malik ending their marriage విడాకులు తీసుకోబోతున్న మరో సెలెబ్రిటీ జంట
Advertisement
Ads by CJ

ఈమధ్యన ఎక్కువగా సెలెబ్రిటీ జంటలు విడాకులు తీసుకుని వేరయ్యి వాళ్ళు సఫర్ అవడమే కాదు, ఫామిలీస్ ని బాధపెడుతూ అభిమానులకి పరిక్ష పెడుతున్నారు. గత ఏడాది సమంత-నాగ చైతన్య విడాకుల విషయంలో వాళ్ళెంత బాధపడ్డారో కానీ అభిమానులు మాత్రం బాగా బాధపడ్డారు. ఈ ఏడాది ధనుష్-ఐశ్వర్య ల జంట కూడా విడాకుల పేరుతో రజినీకాంత్ అభిమానులని హార్ట్ చేసింది. ఇక ఇప్పుడు టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్ కి విడాకులు ఇవ్వబోతుంది అనే న్యూస్ నేడు సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది. 

పాక్ క్రికెటర్ ని ప్రేమించి పెళ్లాడిన సానియా మీర్జా భర్త తో కలిసి ఉన్న రోజులు తక్కువే. ఎక్కువగా ఇండియాలోనే ఉన్న సానియా మీర్జా ప్రస్తుతం తన కొడుకు కోసమే భర్త షోయబ్ తో కలిసి ఉంటుంది అని, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకుని వేరు కాబోతున్నారని తెలుస్తుంది. వీరి మధ్యన తలెత్తిన విభేదాల వలన ఈ జంట వేరు వేరుగా ఉంటుంది అని కొడుకు ఇజుహన్ కోసమే కలుస్తున్నారని, త్వరలోనే విడాకులు తీసుకుని వివాహ బంధానికి గుడ్ బై చెప్పెయ్యబోతున్నారని ప్రచారం జరుగుతున్నా సానియా కానీ, షోయెబ్ కానీ ఈ విషయమై ఇంకా స్పందించలేదు. 

Sania Mirza-Shoiab Malik ending their marriage:

Sania Mirza heading for a divorce

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ