Advertisementt

ప్రేయసిని పరిచయం చేస్తా - విశాల్

Tue 08th Nov 2022 06:07 PM
tamil hero vishal,vishal love marriage  ప్రేయసిని పరిచయం చేస్తా - విశాల్
Vishal opens about his love marriage ప్రేయసిని పరిచయం చేస్తా - విశాల్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి విషయంలో ఎప్పుడూ సంచలనమే. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ విఫలమయినా విశాల్ కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్ కి చెందిన అనీషా రెడ్డి తో నిశ్చితార్ధం చేసుకున్నాడు. కానీ ఆ నిశ్చితార్ధం కూడా బ్రేకప్ అవడంతో విశాల్ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా ప్రేమ, పెళ్లి విషయంలో కామ్ గా ఉన్న విశాల్ మరోసారి నటి అభినయని వివాహం చేసుకోబోతున్నాడనే న్యూస్ మొదలయ్యింది. కానీ విశాల్ తో పెళ్లి వార్తలని అభినయ కొట్టిపారేసింది. 

తాజాగా విశాల్ పెళ్లిపై, ప్రేమపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ఓ చారిటబుల్ ట్రస్ట్ తో కలిసి ఓ పదకొండు జంటలకు తన ఖర్చులతోపెళ్లి జరిపించాడు. తాళి బొట్టుతో సహా ఇంకా కొంత సహాయం చేసిన విశాల్ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకి అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదని, ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు నడుస్తాను అని చెప్పిన విశాల్ తాను ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే పరిచయం చేస్తాను అంటూ అందరిలో క్యూరియాసిటీ పెంచేసాడు. అంతేకాకుండా తనకి ప్రేమ వివాహం చేసుకోవాలని ఉంది అంటూ తన మనసులోని కోరికని బయటపెట్టాడు విశాల్.

Vishal opens about his love marriage:

Tamil Hero Vishal Clarity On His Love Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ