Advertisementt

జాన్వీకపూర్ ఇలా అడుక్కుంటుందేంటి?

Thu 10th Nov 2022 10:57 AM
janhvi kapoor,emi payment,sridevi daughter,janhvi kapoor photos,heroine,bollywood,brands  జాన్వీకపూర్ ఇలా అడుక్కుంటుందేంటి?
Janhvi Kapoor Shocking Explanation on Her Spicy Pics జాన్వీకపూర్ ఇలా అడుక్కుంటుందేంటి?
Advertisement
Ads by CJ

ముఖ్యంగా వాట్సప్ సందేశాల్లో.. ‘ఈ పోస్ట్ పది మందికి షేర్ చేయండి.. ప్రతి షేర్‌కి వాట్సప్ వాళ్లు ఒక రూపాయి చొప్పున ఇస్తారంట. మీరు డైరెక్ట్‌గా సాయం చేయకపోయినా.. ఈ సాయం చేయండి ప్లీజ్’ అనే సందేశం ఎక్కువగా సంచారం చేస్తుంటుంది. ఈ సందేశానికి వారు జోడించే ఫొటోలు చూస్తే.. మనసు ద్రవించిపోతుంది. వెంటనే షేర్ చేయాలని అనిపిస్తుంది. నిజంగా వాట్సప్ వాడు రూపాయి ఇస్తాడో లేదో తెలియదు కానీ.. ఈ సందేశం మాత్రం బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇదొక తరహా బెగ్గింగ్. సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇలాంటి పనే చేస్తున్నానంటోంది అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్. ఏంటి జాన్వీకపూర్ అడుక్కుంటుందా? అని ఆశ్చర్యపోవద్దు కానీ.. ఆమె చేసేది మాత్రం అదే. 

 

సినిమా ఫంక్షన్స్‌లో కాస్త పద్ధతిగా కనిపించే జాన్వీకపూర్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది. పైగా ఆ ఫొటోలకు ‘కిస్ మీ’, ‘మ్యారీ మీ’, ‘టచ్ మీ’ అంటూ క్యాప్షన్ పెడుతుంటుంది. ఇదేంటి జాన్వీ ఇలా పోస్ట్ చేస్తుందేంటి? అసలు ఈ పని చేస్తుంది జాన్వీనా లేదంటే వేరే ఎవరైనానా? అని అంతా ఆశ్చర్యపోతుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ పోస్ట్‌లపై జాన్వీ స్పందించింది. ఆ పోస్ట్‌లు పెట్టడానికి కారణం.. అదనంగా నాలుగు లైక్స్ వస్తాయనే పెడుతున్నానని తెలిపింది. అలా లైక్స్ వస్తే.. ఏదో ఒక బ్రాండ్ తనని అప్రోచ్ అవుతుందని, అంబాసిడర్‌గా తీసుకుంటుందని.. తద్వారా వచ్చే డబ్బుతో.. EMIలు కట్టుకుంటానని జాన్వీ సెలవిచ్చింది. ఇదన్నమాట జాన్వీ అడుక్కునే వ్యవహారం. ఇదో కొత్త తరహా బెగ్గింగ్.

Janhvi Kapoor Shocking Explanation on Her Spicy Pics:

Janhvi Kapoor begging for Her EMI Payment

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ