‘ఆచార్య’ సినిమా టైమ్‌లో దర్శకుడు హరీష్ శంకర్‌కే కాకుండా.. మెగాస్టార్ మరికొంత మందికి కూడా ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సినిమాలో చిరు చేసిన ‘ఆచార్య’ పాత్రకు గౌరవమిస్తూ.. కుర్ర దర్శకులు కొందరు పాఠాలు నేర్చుకునేందుకు ఆసక్తికనబరిచారు. వారి ఆసక్తిని గమనించిన మెగాస్టార్ కూడా.. వారందరితో సమావేశమై, తన లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ను, తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఇక ఆ సినిమా రిజల్ట్ తర్వాత అవన్నీ పక్కకి వెళ్లిపోయాయనుకోండి.. అదే వేరే విషయం. అయితే, ఆ కుర్ర దర్శకులందరూ ఇప్పుడు నటసింహం బాలయ్యతో సినిమా చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుండటమే.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతుంది.
‘చిరుతో పాఠాలు.. బాలయ్యతో సినిమాలు’ అన్నట్లుగా వారి వ్యవహారం ఉంది. చిరుతో ఇంటర్వ్యూలో పాల్గొన్న కుర్ర హీరోలలో వెంకటేష్ మహా (కేరాఫ్ కంచరపాలెం మూవీ దర్శకుడు) కూడా ఉన్నారు. ఆయన బాలయ్యతో సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నట్లుగానూ చెబుతూ.. ఓ అద్భుతమైన కథ కూడా రెడీ చేసినట్లుగా తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాగే బాలయ్య బాబుని చూస్తూనే పెరిగాం.. చొక్కాలు చించుకున్నాం.. వంటి కామెంట్లు కూడా చేసినట్లుగా టాక్. ఆయనే కాదు.. ఈ మధ్య కుర్ర దర్శకులని ఎవరిని కదిలించినా.. బాలయ్యతో సినిమా చేయడం డ్రీమ్ అన్నట్లుగా మాట్లాడుతుండటం విశేషం. ఆల్రెడీ గోపీచంద్ మలినేని ‘వీరసింహా రెడ్డి’ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి లైన్లో ఉన్నాడు. పరశురామ్ త్వరలోనే కలుస్తానన్నాడు. ఇప్పుడు మహా. వీరే కాదు.. ఇంకా ప్రశాంత్ వర్మ ఇలా లిస్ట్‌లో ఇంకో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ కూడా నటసింహం కోసం వెయిటింగ్ అంటున్నారంటే.. ఇదంతా బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ క్రేజ్‌కి కొలమానమని ఫిక్స్ అయిపోవచ్చు.