ఏంటి మళ్లీ.. సన్నీలియోన్ పేరు కొడితే ఏమైనా వైరస్ లాంటివి వస్తున్నాయా? అని అనుకుంటారేమో.. ఆ వైరస్ ఎప్పుడూ ఉండేదేలే కానీ.. ఈ విషయం మాత్రం వైరస్‌కి సంబంధించినది కాదు. మరి ఎందుకు జాగ్రత్తలు చెబుతున్నారు? నెక్ట్స్ క్వశ్చన్ ఇదేగా? ఆ విషయంలోకే వస్తే.. సన్నీలియోన్‌తో సినిమాలు కానీ, ఐటం సాంగ్స్‌గానీ చేసే వారు ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆమె కండీషన్స్‌కు అంగీకరించేలా ప్రీపేర్ అయితేనే ఆమెను సంప్రదించండి. అయితే కండీషన్స్ అంటుంది కదా.. అని ఏవేవో ఊహించుకోవద్దు. ఇదేం ఆమె రెమ్యూనరేషన్‌కి సంబంధించి కూడా కాదు. ఆమె పెట్టిన కండీషన్స్ చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. అవేంటంటే..
‘తనతో సినిమాలు చేయాలనుకునే వారు.. షూటింగ్ లొకేషన్స్‌లో కరోనా నిబంధనలు తప్పక పాటించాలి. అలాగే తనతో పాటు వచ్చిన వారికి కూడా తగిన మర్యాదలు ఇవ్వాలి. ఇక ఐటమ్ సాంగ్స్ వంటివి చేసే సమయంలో.. ఆ లొకేషన్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పిల్లలు ఉండకూడదు. అలాగే ఇతర డ్యాన్సర్లకు కూడా తనకిచ్చినట్లే గౌరవం ఇవ్వాలి..’. ఇవి సన్నీలియోన్ పెట్టిన కండీషన్స్. చాలా రీజనబుల్‌గా ఉన్నాయి కదా. రీసెంట్‌గా ఓ తమిళ దర్శకుడు ఆమెను ఐటం సాంగ్ కోసం సంప్రదించగా.. సన్నీ ఈ కండీషన్స్ పెట్టినట్లుగా సమాచారం. అందుకు ఆ దర్శకుడు అంగీకరించడంతో.. ఆమె డేట్స్ ఇచ్చిందని కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది.