మెగా ఫ్యామిలిలో మెగాస్టార్ వైఫ్ సురేఖ గారే పవన్ కళ్యాణ్ దగ్గర నుండి అందరిని ఎంతో బాగా చూసుకున్నారని ఆ ఫ్యామిలీ మెంబెర్స్ చెబుతూ ఉంటారు. అయితే చిరు రెండో కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ ని పెళ్లి చేసుకునేందుకు ఫ్యామిలీతో ఫైట్ చేసింది. కానీ ఓ పాప పుట్టాక శ్రీజ మొదటి భర్త శిరీష్ కి విడాకులు ఇచ్చి తండ్రి చిరు చెంతకి చేరింది. మెగా ఫ్యామిలీ ఆమెని అక్కున చేర్చుకుని, తర్వాత చిరు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కళ్యాణ్ దేవ్ తో శ్రీజ రెండో వివాహం అంగరంగ వైభవంగా చేసారు. కానీ కళ్యాణ్ దేవ్ తో ఓ బిడ్డని కన్నాక శ్రీజ-కళ్యాణ్ లు విడిపోయారు. ప్రస్తుతం శ్రీజ భర్తకి దూరంగా మెగా ఫ్యామిలీ దగ్గరే ఉంటుంది.
విడాకుల తర్వాత ఆమెని ఛిల్ చెయ్యడానికి రామ్ చరణ్ అప్పట్లో ముంబై తీసుకువెళ్లాడు, అలాగే ఈమధ్యన తన చెల్లెళ్ళు సుష్మిత, శ్రీజలతో రామ్ చరణ్ స్పెషల్ గా ఊటీ ట్రిప్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ, అక్కడ వాళ్ళు చదువుకున్న స్కూల్ ని విజిట్ చేసి హుషారుగా కనిపించారు. ఇక నేడు శ్రీజ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ తన చెల్లిని హాగ్ చేసుకున్న పిక్ ని షేర్ చేస్తూ To the Strongest lady in my house !! Happy birthday @sreejakonidela ❤️😘 అంటూ చెల్లెకి పుట్టిన రోజు శుభాకాంక్షలని సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.