బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసు విషయంలో సతమతమవుతోంది. ఆమె సుఖేశ్ చంద్రశేఖర్ నుండి బహుమతుల రూపంలో కోట్లాది రూపాయలు విలువ చేసే బహుమతులు అందుకోవడం, సుఖేశ్ చంద్రశేఖర్ కి సంబందించిన చీటింగ్ కేసులో జాక్వలిన్ ని భాగం చేసిన ఈడీ ఆమెకి నోటీసు లు ఇవ్వడమే కాకుండా ఆమెని అరెస్ట్ చేసే అనుమతులు కోర్టు నుండి తీసుకోవడంతో జాక్వలిన్ తరుపు న్యాయవాది ఆమెకి ముందస్తు బెయిల్ సంపాదించి ఆమెని అరెస్ట్ కాకుండా ఆపాడు. ఆ ముందస్తు బెయిల్ గడువు నేటితో(నవంబర్ 10) ముగియడంతో.. ఈ రోజు జాక్వలిన్ ఢిల్లీ కోర్టుకి హాజరయ్యింది.
అయితే ఢిల్లీ కోర్టు ఈ కేసు విచారణలో భాగంగా ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ జడ్జి ప్రశ్నించారు. అసలు జాక్వెలిన్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టుకి ఈడీ అభ్యంతరం తెలిపింది. జాక్వలిన్ దగ్గర చాలా డబ్బు ఉంది. మేము ఎంతగా కష్టపడినా మా దగ్గర లేని డబ్బు జాక్వలిన్ దగ్గర ఉంది.. ఆమె కి బెయిల్ ఇస్తే దేశం విడిచి పారిపోయే అవకాశాలున్నాయని వాదించింది. అంతేకాకుండా విచారణకు ఆమె ఎంత మాత్రం సహకరించలేదని, ఆధారాలు చూపించి వాటి విషయంలోనే వివరాలు వెల్లడించినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది. దీనితో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వచ్చే శుక్రవారం బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది ఢిల్లీ కోర్టు.