ఈ రోజు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే.. అది నాగ శౌర్య పెళ్లి వార్తే. ఈ రోజు మద్యాన్నం ఉన్నట్టుండి నాగ శౌర్య పెళ్లి వార్త బయటికి వచ్చింది. అసలు ఇప్పటివరకు నాగ శౌర్య ఎవరిని ప్రేమిస్తున్నాడో అని కానీ, లేదంటే నాగ శౌర్య ప్రేమలో ఉన్నాడనే న్యూస్ ఎక్కడా వినిపించలేదు, కనిపించలేదు. కానీ సడన్ గా బెంగుళూరు కు చెందిన అనూష తో నాగ శౌర్య ఈ నెల 20 న బెంగుళూరు వేదికగా ఏడడుగులు వెయ్యబోతున్నాడనే వార్త చూసిన చాలామంది.. అసలు ఈ అనూష శెట్టి ఎవరు, ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏమిటి అనే ఆరాలు తియ్యడం మొదలు పెట్టారు.
అసలు నాగ శౌర్య అనూషని ప్రేమ పెళ్లి చేసుకుంటున్నాడా? లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహమా? అనే అనుమానాలతో సతమతమవుతున్నారు. అయితే నాగ శౌర్య వివాహం చేసుకోబోయే అనూష నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన అమ్మాయే. ఎందుకంటే ఆమె నేషనల్ వైడ్ గా డిజైనర్ ఆఫ్ ది ఇయర్ 2019 మరియు 2020 టైటిల్ ని గెలుచుకుని ఫెమస్ అయిన ఫిగర్. అనూషా శెట్టి ఒక ఇంటీరియర్ డిజైనర్, న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుండి ఇంటీరియర్ డిజైన్ సర్టిఫికేషన్ మరియు ఎంట్రప్రెన్యూర్‌షిప్ మరియు మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది. ఇండియాలోనే నెంబర్ 1 ఇంటీరియర్ డిజైనర్‌గా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ మ్యాగజైన్ కవర్ పేజీలో అనూష మెరిసిపోయింది. అయితే నాగ శౌర్య-అనూష కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని.. వీరి ప్రేమని పెద్దలు ఒప్పుకుని వివాహం చేస్తున్నారని తెలుస్తుంది.