Advertisementt

యశోద కి అదే హెల్ప్ అయ్యింది

Sun 13th Nov 2022 10:27 AM
samantha,myositis diagnosis,yashoda  యశోద కి అదే హెల్ప్ అయ్యింది
That helped Yashoda యశోద కి అదే హెల్ప్ అయ్యింది
Advertisement
Ads by CJ

సమంత నటించిన యశోదకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాదు, శనివారం హైదరాబాద్ లోని యశోద థియేటర్స్ అన్ని ఫుల్ ఆక్యుపెన్సీ తో కళకళలాడాయి. యశోద రిలీజ్ అయిన మల్టిప్లెక్స్ లు అన్నీ ఫుల్ అక్యుపెన్సీతో నడిచాయి. అయితే యశోద లో సమంత వన్ మ్యాన్ షో చేసింది. కాకపోతే ఆమె ఫ్యామిలీ మాన్ లో చేసిన ఫైట్స్ నే మళ్ళీ మళ్ళీ చూపించారు అనిపించినా.. సమంత పెరఫార్మెన్స్ కి వంక పెట్టటానికి లేదు. సమంత ప్రెగ్నెంట్ లేడి గా చేసిన యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ అందరూ ఎవరి పాత్రకి వారు న్యాయం చేసారు. కాకపోతే చాలామందికి ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయితే ఇంకా బావుండేది.. సిల్వర్ స్క్రీన్ మీద అంత స్కోప్ లేదు అంటున్నారు.

కానీ యశోద కి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి మెయిన్ కారణం సమంత సిక్ అవడమే. ఆమె యశోద ముందు సెలైన్ బాటిల్ తో చెప్పిన డబ్బింగ్ పిక్ కానివ్వండి, యశోద కోసం ఇచ్చిన సింగిల్ ఇంటర్వ్యూలో సమంత తన పై వస్తున్న ట్రోలింగ్, అలాగే వ్యాధి విషయంలో పడిన నరకాన్ని చెబుతూ కన్నీళ్లు పెట్టడం అన్ని యశోద కి హెల్ప్ అయ్యాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో యశోదకి మంచి ఊపొచ్చి కలెక్షన్స్ పుంజుకున్నాయి. సమంత ప్రమోషన్స్ కి రాలేని నిస్సహాయత, ఆమె పడిన కష్టం అన్నీ తెరపై కనిపించాయి. మరి ఈ వీకెండ్ పూర్తయ్యేలోపు యశోద కలెక్షన్స్ మేటర్ ఏమిటో తేలిపోతుంది.

That helped Yashoda:

Samantha opens up about her condition after Myositis diagnosis

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ