Advertisementt

ప్రభాస్ ఆ డైరెక్టర్‌ని పక్కన పెట్టేశాడా?

Tue 15th Nov 2022 09:25 AM
prabhas,sundeep vanga,spirit,maruti,siddharth anand,project k,adipurush,salaar,prabhas movies  ప్రభాస్ ఆ డైరెక్టర్‌ని పక్కన పెట్టేశాడా?
Prabhas Ignores Talented Director Sundeep Vanga ప్రభాస్ ఆ డైరెక్టర్‌ని పక్కన పెట్టేశాడా?
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఆ డైరెక్టర్‌ని పక్కన పెట్టేశాడా?.. ఏమో చూస్తుంటే అదే అనిపిస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్‌తో ప్రభాస్ వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్‌లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని కూడా ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి. మారుతితో చేసే సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్‌ కూడా ప్రభాస్ పూర్తి చేశాడనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘ఆదిపురుష్’ తర్వాత మరో బాలీవుడ్ డైరెక్టర్‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పినట్లుగా టాక్ నడుస్తుంది.

 

అయితే ప్రభాస్ సినిమాల ఎంపిక బాగానే ఉంది కానీ.. అసలు ఆయన లైన్ అయితే ఇది కాదు. ‘ఆదిపురుష్’ తర్వాత ‘సలార్’ చిత్రం చేయాలి. ‘సలార్’ తర్వాత లేదంటే దానితో సమానంగా ‘ప్రాజెక్ట్ K’ చేయాలి. ఇంత వరకు కరెక్ట్‌గా ఫాలో అవుతూ వస్తున్న ప్రభాస్.. ఈ లైన్‌లో ఉన్న సందీప్ వంగాని పక్కన పెట్టేశాడనేలా టాక్ నడుస్తుంది. ఆర్డర్ ప్రకారం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ తర్వాత ప్రభాస్.. తదుపరి చిత్రం సందీప్ వంగాతో ‘స్పిరిట్’ అనే చిత్రం చేయాలి. కానీ ఇప్పుడు మారుతి సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌తో ఓ చిత్రం చేయబోతున్నాడనేలా టాక్ నడుస్తుంది. మరి సందీప్ వంగాతో ‘స్పిరిట్’ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అసలీ మధ్య కాలంలో ‘స్పిరిట్’ వార్తలు వినబడిందే లేదు. ఇంతకీ సందీప్‌తో ‘స్పిరిట్’ ఉన్నట్లా? లేనట్లా? దీనికి ఇప్పుడెవరు సమాధానం ఇస్తారో కూడా క్లారిటీ లేదు. అది విషయం.

Prabhas Ignores Talented Director Sundeep Vanga:

No Update From Prabhas and Sundeep Vanga Spirit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ