Advertisementt

వెంకటేష్ షాకింగ్ డెసిషన్

Sun 13th Nov 2022 12:02 PM
venkatesh,f3,ori devuda  వెంకటేష్ షాకింగ్ డెసిషన్
Venkatesh shocking decision వెంకటేష్ షాకింగ్ డెసిషన్
Advertisement
Ads by CJ

సీనియర్ హీరోలలో వరస సక్సెస్ లతో, వయసుకు తగిన పాత్రల్తో దూసుకుపోతున్న వెంకటేష్.. ఈమధ్యన ఒరిజినల్ కథలకన్నా ఎక్కువగా రీమేక్స్ ని నమ్ముకుని రంగంలోకి దిగడమే కాదు, ఆ రీమేక్స్ తో పర్ఫెక్ట్ గా హిట్ కొట్టేస్తున్నారు. అలా దృశ్యం సీరీస్, నారప్ప లతో వయసుకు సరితూగే పాత్రలతో అద్భుతంగా కనిపించారు. ఇక రీసెంట్ గా వెంకీ F3 అలాగే ఓరి దేవుడా సినిమాతో హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న రానా నాయుడు వెబ్ సీరియస్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. వెంకటేష్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. 

ఆ డెసిషన్ లో భాగంగానే ఆయన కొత్త కథలు వినేందుకు ఇంట్రెస్టింగ్ గా లేరట. అంటే వెంకటేష్ కొద్దిరోజుల పాటు సినిమాలకి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారట. అందుకే ఆయన తన దగ్గరకి వచ్చే కథలని వినేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని.. కొద్ది రోజుల గ్యాప్ తర్వాతే కొత్త సినిమా చేస్తానని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వెంకటేష్ సినిమాలకి బ్రేకిచ్చి ఆధ్యాత్మికంగా ప్రశాంతతని కోరుకుంటున్నారట. ఆధ్యాత్మికత సాధన తర్వాత వెంకటేష్ తిరిగి కొత్త సినిమాని ప్రకటిస్తారని, అప్పటివరకు వెంకటేష్ నుండి ఎలాంటి మూవీ అనౌన్సమెంట్ ఉండదు అని తెలుస్తుంది.

Venkatesh shocking decision:

Venkatesh shocking decision on movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ