నందమూరి బాలకృష్ణ లాంటి నటసింహాన్ని తన కాంపౌండ్ లో కట్టిపడేసి.. తన ఆహా సంస్థని అందరి నోళ్ళలో నానెలా చేసి.. విపరీతమైన క్రేజ్ తెచ్చి సొమ్ము చేసుకుంటున్న అల్లు అరవింద్ ని చూస్తే చాలామందికి ఈర్ష్య కలుగుతుంది. ఆహా లో అన్ స్టాపబుల్ మాత్రమేనా.. తన చిన్న కొడుకు శిరీష్ కోసం బాలయ్యని గెస్ట్ గా తీసుకొచ్చి ఆహా అనిపించిన అరవింద్ గారు ఇప్పుడు రాంగ్ ట్రాక్ లోకి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆహా లో అన్ స్టాపబుల్ సీజన్ 2 ని నారా చంద్రబాబు నాయుడుతో ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టారు. కాకపోతే వారం వారం రావాల్సిన కొత్త ఎపిసోడ్స్ మాత్రం రావడం లేదు. చంద్రబాబు తర్వాత రెండో వారం విశ్వక్ సేన్-సిద్దు జొన్నలగడ్డ ఎపిసోడ్ తో అంచనాలు పెంచేసి.. మూడో వారం సింపుల్ గా పాత ఎపిసోడ్స్ అన్ సీన్ ఎపిసోడ్ అంటూ బిల్డప్ ఇచ్చారు కానీ.. కొత్తగా ఎపిసోడ్ ఇవ్వలేదు.
ఆ తర్వాత వారం అడివి శేష్-శర్వానంద్ లతో బాలయ్య ఆట అందరిని అబ్బుర పరిచింది. ఆ ఎపిసోడ్ అందరికి కిక్ ఇచ్చింది. తర్వాత రాబోయే గెస్ట్ లపై అంచనాలు పెరుగుతన్న టైమ్ లో ఈ వారము ఎలాంటి కొత్త గెస్ట్స్ లేకుండానే ఆహా ఎపిసోడ్ ని స్కిప్ చేసారు. మరి వరస ఎపిసోడ్స్ తో హోరెత్తించాల్సిన ఆహా టీం.. ఇలా మధ్యలో గ్యాప్ గ్యాప్ లు ఇస్తూ స్కిప్ చేస్తుంటే.. బాలయ్య ని మిస్ అయ్యే ఫాన్స్ ఈ షో ని లైట్ తీసుకుంటారేమో జర ఆలోచించండి అరవింద్ గారూ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వారం వారం ఆహా వేదికపై బాలయ్య అల్లరి, ఆయన చేసే సందడి నిజంగానే మిస్ అవుతున్నారు ప్రేక్షకులు. దీని మీద దృష్టి పెడితే బావుంటుంది అంటూ రిక్వెస్ట్ పెడుతున్నారు వాళ్ళు.