ఆరు నెలలుగా ఈటీవీలో కనిపించని సుడిగాలి సుధీర్ ఈ ఆరు నెలలు ఇతర ఛానల్స్ లో కొద్దిగా హడావిడి చేసేసి.. మళ్ళీ ఈ టీవీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ తిరిగొచ్చేసిన సుధీర్ మరోసారి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా మారిపోయాడు. కొత్తగా స్టయిల్ కూడా మార్చాడు. ఈ రోజు ఆదివారం సుధీర్ శ్రీ దేవి డ్రామా కంపెనీలో కుమ్మేసాడు. ఇక మిగిలింది సుధీర్ రీ ఎంట్రీ ఇవ్వాల్సిన జబర్దస్త్ లో కూడా సుధీర్ ఎంట్రీ ఇచ్చేసాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ వచ్చేసాడు. కాకపోతే కమెడియన్ గా కాదు. హీరోగా. అంటే సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది తన సినిమా ప్రమోషన్స్ కోసం.
సుడిగాలి సుధీర్ గా ఫెమస్ అయ్యాక సుధీర్ హీరో అవతారమెత్తాడు. సక్సెస్ లు లేకపోయినా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రీసెంట్ గా వాంటెడ్ పండుగాడు తో ప్లాప్ కొట్టిన సుధీర్ గాలోడు తో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. గాలోడు రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ తన దర్శకనిర్మాతలతో కలిసి ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి వెళ్లి గాలోడుని ప్రమోట్ చెయ్యడమే కాదు, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ తో కలిసి స్కిట్ చెయ్యడం, తన ఆన్ స్క్రీన్ లవర్ రష్మీ తో కలిసి పులిహార కలపడం, గాలోడు హీరోయిన్ తో డాన్స్ అన్ని ఆ ఎపిసోడ్ లో హైలెట్ అయ్యేలా ప్రోమో కట్ చేసారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుధీర్ రీ ఎంట్రీ తో ఇరగదీసేసాడు.