Advertisementt

బిగ్ బాస్ విన్నర్ అతనే: వాసంతి

Mon 14th Nov 2022 05:34 PM
vasanthi,bigg boss telugu 6 winner  బిగ్ బాస్ విన్నర్ అతనే: వాసంతి
He is the Bigg Boss 6 winner: Vasanthi బిగ్ బాస్ విన్నర్ అతనే: వాసంతి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో పదివారాల్లో పదకొండు మంది ఎలిమినేట్ అవ్వగా.. ఇంకా 10 మంది హౌస్ లో ఉన్నారు. నాగర్జున ఈ ఆదివారం టాప్ 10 లో మీరున్నారు.. విన్నర్ కి 50 లక్షలు అంటూ అనౌన్స్ కూడా చేసారు. ఇక ఈ పది వారాల్లో బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ టాప్5 లో ఉండబోయే వారి పేర్లు చెబుతున్నారు. అందులో టాప్ 5 అనుకున్న సూర్య, గీతూ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు టాప్5 లో ఉంటారు అనుకున్న వాళ్లలో రేవంత్, శ్రీహన్ ఉన్నారు. తాజాగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన పదకొండో కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ టాప్ 5 అనేది ఇప్పుడే చెప్పలేను, నేను కొద్దిగా ఎపిసోడ్స్ చూసి చెప్తాను, కానీ రేవంత్ టాప్ 5 కాదు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. 

రేవంత్ చాలా కష్టపడతాడు. గేమ్ లో చాలా అగ్రెసివ్ అవుతాడు, ఫిజికల్ గేమ్ ఆడినా.. కావాలని ఆడడు.. అనుకోకుండా అలా జరిగిపోతుంది అంటూ రేవంత్ కన్ ఫర్మ్ గా బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే అతను అందరికన్నా బాగా ఆడతాడు, అందరితో బాగా ఉంటాడు అంటూ వాసంతి బిగ్ బాస్ విన్నర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

అయితే గత రెండు వారాలుగా టాప్ లో ఉండి, టైటిల్ ఫెవరెట్ అనుకున్న రేవంత్ కి ఇనాయ అటు ఓటింగ్ లోను, ఇటు క్రేజ్ పరంగా గట్టి పోటీ ఇస్తుంది.. ఇలానే కొనసాగితే బిగ్ బాస్ టైటిల్ రేవంత్-ఇనాయ మధ్యలో ఎవరికి వస్తుందో అనేది అంచనా వెయ్యడం కష్టం.

He is the Bigg Boss 6 winner: Vasanthi:

Vasanthi Predicts Bigg Boss Telugu 6 Winner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ