సూపర్ స్టార్ కృష్ణ కడసారి చూపుల కోసం అభిమానులు హైదరాబాద్ లోని పద్మాలయ స్టూడియోస్ కి భారీగా చేరుకున్నారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులతో పద్మాలయ స్టూడియో పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. ఇసుక వేస్తె రాలనంత అభిమానులు అక్కడ కనిపించారు. ఒకొనొక సమయంలో బారిగేట్లు తోసుకుని రావడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం కనబడింది. అభిమానుల తొక్కిసలాటలో ఓ అభిమానికి తీవ్ర గాయాలయ్యాయి. అభిమానుల తాకిడి తట్టుకోలేక పోలీస్ లు లాఠీ ఛార్జ్ చెయ్యాల్సి వచ్చింది.
అయితే ఈ రోజు ఉదయం ఏపీ మినిస్టర్ రోజా కృష్ణ గారి భౌతిక కాయానికి నివాళులర్పించి మీడియాతో మట్లాడారు. కృష్ణ గారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారి ఓన్ బ్యానర్ లో సినిమాలు చెయ్యడం తన అదృష్టమని, ఆయన తోటి నటులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు, ఆయన చనిపోయారన్న బాధ ఉన్నప్పటికీ.. ఆయన జీవితంలో అన్ని చూసేసారు.. ప్రశాంతంగా కన్ను మూసారు, మహేష్ బాబు నాకు చిన్నప్పుడు నుండి తెలుసు. (నా చిన్నప్పటి నుండి కాదు, ఆయన చిన్నప్పటినుండి) మహేష్ తో సినిమా చెయ్యాలని ఉండేది.
మహేష్ కి అత్త పాత్రలో నటించాలని ఉండేది అంటూ రోజా చెప్పడమే కాకుండా.. ఈ ఏడాది మహేష్ తనకెంతో ఇష్టమైన ముగ్గురిని కోల్పోయారు. అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ అంతా మహేష్ కి తోడుగా ఉంటుంది అనేది మనం చూసాము అంటూ రోజా మహేష్ తో నటించాలనే కోరికని బయటపెట్టారు. ప్రస్తుతం రోజా నటనకి దూరంగా రాజకీయాలకి దగ్గర ఉంటున్నారు.