Advertisementt

కాంతార హీరోకి రజినీకాంత్ అదిరిపోయే గిఫ్ట్

Thu 17th Nov 2022 03:16 PM
kantara,rishab shetty,thalaiva rajinikanth  కాంతార హీరోకి రజినీకాంత్ అదిరిపోయే గిఫ్ట్
Rajinikanth gift to Kantara hero కాంతార హీరోకి రజినీకాంత్ అదిరిపోయే గిఫ్ట్
Advertisement
Ads by CJ

కాంతార తో ఇండియా వైడ్ ప్రేక్షకులని తన వైపు తిప్పుకున్న రిషబ్ శెట్టి.. ఇంకా ఇంకా ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నాడు. కాంతార కన్నడ లోనే కాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి ప్రపంచం అంతా ఫెమస్ అయ్యాడు. ఆ సినిమా చూసిన ప్రముఖులు రిషబ్ శెట్టి ని తెగ పొగిడేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే రిషబ్ శెట్టి ని ఇంటికి పిలిపించుకుని మరీ సత్కరించారు.

కాంతార మాస్టర్ పీస్, ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, దర్శకుడిగా, హీరోగా రిషబ్ శెట్టి అద్భుతం, కాంతార టీంకి శుభాకాంక్షలు తెలిపిన రజినీకాంత్ రిషబ్ శెట్టి కి లైఫ్ లో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన విషయం లేటెస్ట్ గా వైరల్ అయ్యింది. రిషబ్ శెట్టిని సత్కరించిన సూపర్ స్టార్ రజనీకాంత్ పాదాలకు రిషబ్ గౌరవంగా నమస్కరించాడు. ఆ తర్వాత రిషబ్ కి రజినీకాంత్ గోల్డ్ చైన్, గోల్డ్ లాకెట్ లను బహుమతులుగా అందించిన విషయం లేట్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Rajinikanth gift to Kantara hero:

Kantara Fame Rishab Shetty Receives A Golden Memorabilia From Thalaiva Rajinikanth 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ