ఇండస్ట్రీలోకి మాస్ గా ఎంట్రీ ఇచ్చి మధ్యలో అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా సినిమాలతో క్లాస్ గా మారిన విశ్వక్ సేన్ మళ్ళీ తనకి అచ్చొచ్చిన జోనర్ లోకి వచ్చేసాడు. మరోమారు దమ్కీ అంటూ మాస్ అవతారమెత్తాడు. నందమూరి నట సింహం బాలయ్య చేతుల మీదుగా దమ్కీ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. దమ్కీ ట్రైలర్ లో వెయిటర్ గా, రిచ్‌గా చాలా ఇంటెన్స్‌గా, రెండు పాత్రల మధ్య విశ్వక్ సేన్ అదిరిపోయే వేరియేషన్ చూపించాడు. పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరిలో విడుదలవుతున్న దమ్కీ ట్రైలర్ లోకి వెళితే..
విశ్వక్ సేన్ పదివేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ అధినేతగా మరియు వెయిటర్‌గా ద్విపాత్రాభినయం చేశాడు. వేలకోట్ల టర్నోవర్ కంపెనీ హీరో లేని కారణముగా ఒక్కసారిగా ఢమాల్ అంటుంది. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుమీదకు వచ్చేస్తారు, కుటుంబం అనాథలా మిగిలిపోతున్న సమయంలో అదే పోలికలతో ఉండి వెయిటర్ జాబ్ చేస్తూ రిచ్ గా గొప్పలు చెప్పుకునే హీరోకి ఆ కంపెనీ బాధ్యతలు ఇస్తే.. దానిని అతను ఎలా లీడ్ చేసాడు అనేది దమ్కీ కథ. అమ్మాయి కోసం గొప్పలు పోయే ఓ వెయిటర్ కి ఒక్కసారిగా పేరు, పలుకుబడి, డబ్బు కనిపిస్తే అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, తన వెంట పడుతున్న విలన్స్ ని మట్టికరిపించాడనికి విశ్వక్ చేసిన యాక్షన్ అంతా ట్రైలర్ లో హైలెట్ అయ్యేలా చూసారు. ముఖ్యంగా హీరోయిన్ నివేత పేతురేజ్ తో రొమాన్స్, అలాగే విశ్వక్ సేన్ హీరోయిజాన్ని హైలెట్ చేసారు.
అంతేకాదు సెన్సార్ కట్స్ కూడా బోలెడన్ని ఉండేలా బీప్ లు వేశారు. హైపర్ ఆది కామెడీ, నివేత పేతురేజ్ అందాలు, విశ్వక్ హీరోయిజం, నిర్మాణ విలువలు అన్ని అద్భుతంగా అమర్చారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్, థ్రిల్స్, ఎమోషన్స్ తో పవర్ ప్యాక్డ్ దమ్కీ లా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.