సూపర్ స్టార్ మహేష్ కి భార్య అవ్వకముందే నమ్రత ఓ హీరోయిన్. అది కూడా బాలీవుడ్ నుండి వచ్చిన హీరోయిన్. ఆమె పేరెంట్స్ కూడా మాములు వాళ్ళేం కాదు. వాళ్ళది ఉన్నత కుటుంబమే. అయినప్పటికీ మహేష్ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న నమ్రత ఆ తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టి మహేష్ ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుంది. ఇద్దరి పిల్లలకి తల్లిగా మహేష్ కి భార్యగా బాధ్యతలు మొయ్యడం పెద్ద విషయమేమి కాదు, ప్రతి గృహిణి చేస్తున్న పని అదేగా అనుకుంటారు చాలామంది. కానీ మహేష్ బాబు సూపర్ స్టార్ గా సినిమాల్లో బిజీగా వుంటారు. ఆ టైమ్ లో నమ్రత ఇద్దరి పిల్లల చదువు, కుటుంబ బాధ్యతలు, మధ్యలో మహేష్ వ్యాపారాలు, ఆయన చేసే మంచి పనుల వెనుక నీడలా నమ్రతనే ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం.
సూపర్ స్టార్ కృష్ణది పెద్ద ఫ్యామిలీ, తమ్ముళ్లు, అలాగే ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు, పెద్ద భార్య, మనవలు, మనవరాళ్లు ఇలా. నమ్రత ఘట్టమనేని కోడలిగా, తెలుగు వారి ఇంట అడుగుపెట్టి.. ఆ బాధ్యలను సక్రమంగా కాదు అందరూ మెచ్చుకునేలా నిర్వహిస్తుంది. ఈ ఏడాది మహేష్ అన్న, నమ్రత బావగారు రమేష్ బాబు మృతి చెందినప్పుడు కానీ, ఆమె అత్తగారు ఇందిరగారు మరణించినప్పుడు కానీ, కృష్ణగారు తుది శ్వాస విడిచినప్పుడు కానీ అన్నిటిలో మహేష్ భార్య అన్ని తానై చూసుకుంది. ముగ్గురు ఆడపడుచులని చూసుకుంటూ.. బావగారి ఫ్యామిలీతో సఖ్యతగా ఉంటూ అత్తగారి చివరి క్షణాలను, మామగారి ఆఖరి క్షణాలను అద్భుతంగా ఉండేలా చూసుకున్న నమ్రత.. మహేష్ కి ప్రతి విషయంలో తోడు నీడలా నిలబడింది.
కుటుంబంలోని ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉంటూ.. మహేష్ ని ఉన్నతంగా చూపిస్తూ.. ఘట్టమనేని ఫ్యామిలీ అడుగడునా అండగా నిలబడిన నమ్రతని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఫ్యామిలీస్ వ్యక్తుల పరంగా విడిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నప్పటికీ.. అందరూ కలిసిన ప్రతీసారి సంతోషంగా చూసుకోవడం మాములు విషయం కాదు, తన పిల్లలు సితార, గౌతమ్ లు నాన్నమ్మ, తాతయ్యలతో అంతగా అనుబంధం పెనువేసుకుపోవడానికి కారణం నమ్రతనే. సమయం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకి తీసుకువెళ్లి వాళ్లతో ఉండేలా చూసుకుంటుంది ఆమె.
మహేష్ నిత్యం షూటింగ్స్ అంటూ హడావిడిగా ఉంటాడు. కానీ నమ్రత ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పట్టించుకుని ఫ్యామిలీని అద్భుతంగా లీడ్ చేస్తుంది. అందుకే అనేది ఆమెని అప్రిషెట్ చెయ్యడమే కాదు.. ఆమెని చూసి ప్రతి మహిళా ఇన్స్పైర్ అవ్వాలని.