Advertisementt

బాలయ్య.. గోవా.. ఉంగరాలు.. ప్రైజ్

Wed 23rd Nov 2022 07:53 AM
balakrishna,rings story,dhamki trailer launch,vishwak sen,nandamuri balakrishna  బాలయ్య.. గోవా.. ఉంగరాలు.. ప్రైజ్
Balayya Shared Goa Rings Story at Dhamki Trailer Launch బాలయ్య.. గోవా.. ఉంగరాలు.. ప్రైజ్
Advertisement
Ads by CJ

‘ఎవడికి ఎట్లా రాసి పెట్టి ఉందో ఎవడికీ తెలియదని అన్నారు’ నందమూరి నటసింహం బాలయ్య. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ధమ్కీ’ చిత్ర ట్రైలర్‌ను ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. అనంతరం.. తన లైఫ్‌లో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను బాలయ్య సరదాగా షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ..

 

తమ్మి విశ్వక్ సేన్ వాళ్ల నాన్న మాట్లాడినప్పుడు.. ఎత్తుకోవడమే ఒక ధమ్కీలాగా గొంతు ఎత్తిండు. తర్వాత మైకులు పనిచేయవేమో.. ఇక నేను మాట్లాడలేనేమో అనుకున్నా. ముందు విశ్వక్ సేన్‌ తమ్మికి, చిత్ర టీమ్‌కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ట్రైలర్ చాలా అద్బుతంగా ఉంది. విశ్వక్ సేన్‌ను నేను సైలెంట్ ఎఫ్ఎఫ్ అని అంటారు. అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అని అనమాట. సినిమాలంటే అతనికి పిచ్చి. ఆ విషయంలో విశ్వక్‌ని మెచ్చుకోవాలి. ఎందుకంటే సినిమాలకు, అతనికి అస్సలు సంబంధం లేదు. వాళ్ల నాన్న ఎప్పుడో జాతకం చూసి చెప్పారేమో. ఏది నీ చెయ్యి.. ఉంగరాలు ఏమీ లేవే (విశ్వక్ సేన్ చేతులు చూస్తూ..). నేను కొన్ని తీశాను.. వేసుకు రాలేదు (తన చేతులు చూయిస్తూ..). ఇంకా ఉన్నాయి.. ఇంట్లో పెట్టొచ్చా. 

 

ఒకసారి ఆ ఉంగరాలన్నీ వేసుకుని గోవాకి వెళ్లా. నేను, మా ఆవిడ.. న్యూ ఇయర్‌కి వెళ్లాం. అప్పుడక్కడ ఒకడు అడిగిండు. ఎవరికి ఎక్కువ ఉంగరాలు ఉన్నాయని. నా రెండు చేతులు చూయించా.. లెక్కేట్టుకుండు. ఇంకా ఎవరికైనా ఉన్నాయోమో అని చూసిండు. ఎవరికీ లేవు.. అప్పుడు నాకు ప్రైజ్ వచ్చింది. ఏదో ఫ్రీ డెస్టినేషన్ ఆఫర్.. రూ. 5 వేలలో హోటల్‌లో 3 రోజులు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫ్రీగా ఉండొచ్చు అన్నారు. మా ఆవిడతో చెప్పినా.. ‘చూసినావా.. ఉంగరాలు ఎందుకు ఎందుకు అన్నావ్.. ఇప్పుడు చూడు.. ఇన్ని ఉంగరాలు ఉన్నాయి కాబట్టే కదా.. మనకి ప్రైజ్ వచ్చిందని అన్నా..’. కాబట్టి.. ఎవడికి ఎట్లా రాసి పెట్టి ఉందో ఎవడికీ తెలియదు.. అంటూ విశ్వక్ సినీ ఎంట్రీపై బాలయ్య చెప్పుకొచ్చారు. 

Balayya Shared Goa Rings Story at Dhamki Trailer Launch:

Balayya about His Rings Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ