Advertisementt

బిగ్ బాస్ 6: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ..

Sat 19th Nov 2022 10:08 AM
bigg boss 6,sri satya,mareena  బిగ్ బాస్ 6: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ..
Bigg Boss 6: Danger Zone Contestants బిగ్ బాస్ 6: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 11 వారాలు పూర్తి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి 11 మంది ఎలిమినేట్ అవ్వగా.. ఇంకా పది మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ వారం తొమ్మిదిమంది ఎలిమినేషన్స్ లో ఉండగా.. అందులో రాజ్ నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యాడు. ఇక కెప్టెన్ గా ఫైమా సేవ్ అవ్వగా.. మిగతా ఎనిమిదిమందిలో ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్న హౌస్ మేట్ పై అంతగా క్యూరియాసిటీ కనిపించడం లేదు. కారణం స్ట్రాంగ్ అనుకున్న వారు ఇంటికెళ్లి.. ఇంకా వీక్ అనుకున్నారు హౌస్ లో ఉండడమే. ఇక ఈ వారం ఎవిక్షన్ ప్రీ పాస్ ని రేవంత్-శ్రీహన్-ఫైమాలు గట్టి గా పోటీపడితే అందులో ఫైమాకి ఆ పాస్ సొంతమైంది.

ఈ వారం ఓటింగ్ పరంగా రేవంత్-ఇనాయలు టాప్ ప్లేస్ కోసం పోటీపడినా.. చివరికి రేవంత్ మొదటి స్థానాల్లో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో ఇనాయ ఉంది. రెండో స్థానం నుండి ఇనాయ వలన మూడో ప్లేస్ లోకి పడిపోయి గత మూడు వారాలుగా ఆ మూడో ప్లేస్ లో ఉన్న శ్రీహన్ అనూహ్యంగా ఆరో స్థానానికి దిగిపోవడం షాకిచ్చింది. మూడో ప్లేస్ లో సింపతీ ఓట్స్ తో కీర్తి కొనసాగుతుండగా, ఆది రెడ్డి నాలుగో ప్లేస్ లో, రోహిత్ ఐదో స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది.

ఈ వారం డేంజర్ జోన్ లో శ్రీ సత్య-మరీనాలు ఉన్నారు. మరీనా కొద్ది వారాలుగా అదృష్టం బావుండి సేవ్ అవుతుంది.. కానీ ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పేలా కనిపించడం లేదు. మరోపక్క శ్రీహన్ తో ఫ్రెండ్ షిప్ వలన శ్రీ సత్యపైన కూడా ప్రేక్ల్షకుల్లో నెగిటివిటి ఉంది. సో ఈ వారం సత్య-మరీనా ఇద్దరిలో ఎవరు వెళ్ళినా పెద్దగా షాకవ్వక్కర్లేదు. 

Bigg Boss 6: Danger Zone Contestants:

Bigg Boss 6: Sri Satya and Mareena in Danger Zone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ