Advertisementt

ప్రెగ్నెన్సీ వార్తలపై ఫైర్ అవుతున్న హీరోయిన్

Sat 19th Nov 2022 12:23 PM
actress nikki galrani,adi pini shetty  ప్రెగ్నెన్సీ వార్తలపై ఫైర్ అవుతున్న హీరోయిన్
Nikki Galrani reacts pregnancy rumours ప్రెగ్నెన్సీ వార్తలపై ఫైర్ అవుతున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

ఈ ఏడాది కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గాల్రానీలు ప్రేమ వివాహం అందరిలో హాట్ టాపిక్ గా నిలిచింది. కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ పెళ్లి పీటలెక్కింది. టాలీవుడ్ నుండి నాని, సందీప్ కిషన్, నీరజ కోన లాంటి సెలబ్రిటీస్ ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని ల వివాహానికి హాజరయ్యారు. తర్వాత ఇద్దరూ పెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఆ తర్వాత హాని మూన్ ట్రిప్ వేసింది ఈ జంట. పెళ్లి తర్వాత నిక్కీ గల్రాని కొత్త సినిమాలు ఒప్పుకోలేదు.

అయితే గత రెండు రోజులుగా ఆది పిన్నిశెట్టి తండ్రి కాబోతున్నాడంటూ వార్తలు రావడం, నిక్కీ గల్రాని ప్రెగ్నెంట్ అనే న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. నిక్కీ-ఆది దంపతులు త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే నిక్కీ గల్రాని తన ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది. నేను ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది గాసిప్స్ ప్రచారం చేస్తున్నారు, ఓ పని చెయ్యండి నా డెలివరీ కూడా మీరే చేసెయ్యండి అంటూ సెటేరికల్ గా కామెంట్ పోస్ట్ చేసింది. 

అంతేకాకుండా ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కాదు, ఫ్యూచర్ లో మాత్రం నేను తప్పకుండా ప్రెగ్నెంట్ అవుతాను, అప్పుడే నేనే స్వయం ఆ శుభవార్త చెబుతాను, కానీ ఇప్పుడు ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ సోషల్ మీడియా ద్వారా నిక్కీ గల్రాని తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలని కొట్టి పారేసింది.

Nikki Galrani reacts pregnancy rumours:

Actress Nikki Galrani Responds on Her Pregnancy Rumors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ