యంగ్ హీరో నాగ శౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఈ నెల 20 ఆదివారం ఉదయం కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష తో నాగ సౌర్య ఏడడుగులు నడిచాడు. బెంగుళూర్ వేదికగా నాగ శౌర్య-అనుషాల వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ నుండి నిర్మాత నాగ వంశీ, అలాగే హీరో బెల్లకొండ శ్రీనివాస్ లాంటి వాళ్ళు హాజరయ్యారు. అయితే నాగ శౌర్య పెళ్ళికి టాలీవుడ్ ప్రముఖులు ఎవరికి ఆహ్వానాలు అందలేదు. కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది చుట్టాలు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యారు. అయితే బెంగుళూర్ లో జరిగిన పెళ్ళికి పిలవకపోయినా.. కనీసం హైదరాబాద్ లో అయినా నాగ శౌర్య రిసెప్షన్ ఏర్పాట్లు చేసి విందు ఇస్తాడేమో అని శౌర్య అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అభిమానులకి ఆహ్వానం లేకపోయినా.. టాలీవుడ్ ప్రముఖులని అయినా నాగ శౌర్య రిసెప్షన్ కి ఆహ్వానించారో.. లేదో అనే క్లారిటీ లేదు. మరి నాగ శౌర్య హీరోగా ఈమధ్యన బాగానే నిలదొక్కుకున్నాడు. అలాగే ఎన్నో సినిమాలు చేసాడు. కో స్టార్స్ ని పిలిచి అయినా నాగ శౌర్య వివాహ విందు ఇస్తాడో.. లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు అయితే హైదరాబాద్ లో నాగ శౌర్య రిసెప్షన్ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం లేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగ శౌర్య-అనుషుల వెడ్డింగ్ రిసెప్షన్ కేవలం ఇంట్లో వాళ్ళతోనే ముగించేయ్యబోతున్నారని, ఈ వేడుకకి టాలీవుడ్ నుండి ఎవరిని పిలవలేదని తెలుస్తుంది. కారణం నాగ శౌర్య ఈమధ్యనే ఆసుపత్రి నుండి డిశ్ ఛార్జ్ అవడంతో ఆయన ఇంకా నీరసంగా ఉన్న కారణంగానే ఆయన కుటుంబ సభ్యులు పెళ్లి హడావిడి, రిసెప్షన్ హడావిడి లేకుండా
అన్ని సింపుల్ గా జరిగేటట్లు చూస్తున్నట్లుగా తెలుస్తుంది.