Advertisementt

కృష్ణగారు చనిపోయే ముందు ఏం మాట్లాడారంటే..

Fri 25th Nov 2022 10:44 AM
adiseshagiri rao superstar krishna,adiseshagiri rao interview  కృష్ణగారు చనిపోయే ముందు ఏం మాట్లాడారంటే..
Adiseshagiri Rao about Super Star Krishna కృష్ణగారు చనిపోయే ముందు ఏం మాట్లాడారంటే..
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 ఉదయం 4 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయనకి ముందురోజు తెల్లవారుఝామునే హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనని ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకపోయింది. అయితే కృష్ణగారికి హార్ట్ ఎటాక్ వచ్చే ముందు రోజువరకు బాగానే ఉన్నారని, తాను ఎప్పటిలాగే తన అన్నయ్యతో కలిసి కూర్చుని మాట్లాడినట్లుగా కృష్ణగారి తమ్ముడు ఆది శేషగిరి రావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మట్లాడారు. గుండెపోటు రావడానికి ముందు కృష్ణగారు ఎలా ఉన్నారో, ఏం మాట్లాడారో అనేది ఆయన ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

ఆ రోజు కృష్ణగారికి గుండెపోటు రాక ముందు కొన్ని గంటల ముందే తాను కలిసాను, ఎప్పటిలాగే సినిమాలు, రాజకీయాల గురించి చర్చించామని, చిన్ననాటి విషయాలు ఇలా చాలా విషయాలు మట్లాడుకున్నాము, సినిమా ట్రెండ్ ఎలా ఉంటుందో కూడా అన్నయ్య మట్లాడారు. సినిమా సక్సెస్ కావాలంటే ఆ సినిమా గురించి వదిలే ప్రోమో బావుండాలి. సినిమాలో విషయం ఉన్న లేకపోయినా ప్రోమో బావుంటే సినిమా ఆడుతుంది అని చెప్పారు. సినిమా చూడొచ్చు, చూడకూడదు అనేది కేవలం ప్రోమోని డిసైడ్ చేస్తుంది అంటూ అన్నయ్య మాట్లాడారు.

ప్రోమో బావుంటే ఆ సినిమాలో నటీనటులు ఎవరనేది ఆడియన్స్ పట్టించుకోకుండా థియేటర్స్ కి వెళతారు, అంతేకాకుండా కొన్ని సినిమాలు ఉదాహరణకు కూడా చెప్పారు. అవన్నీ ఇప్పుడు చెబితే బాగోదు అంటూ ఆది శేషగిరి గారు అన్నయ్యతో గుండెపోటురావడానికి ముందు ఏమేం మాట్లాడారో అనేది రివీల్ చేసారు.

అలాగే ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చాక ఆసుపత్రికి తరలించడం లెట్ అయ్యింది అని వస్తున్న రూమర్స్ ని అది శేషగిరి రావు ఖండించారు.

Adiseshagiri Rao about Super Star Krishna:

Adiseshagiri Rao Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ