Advertisementt

అత్తగారి మనసు గెలిచిన నయనతార

Fri 25th Nov 2022 07:38 PM
vignesh shivan,meena kumari,nayanthara  అత్తగారి మనసు గెలిచిన నయనతార
Vignesh Shivan Mother Lauds Her Daughter-In-Law అత్తగారి మనసు గెలిచిన నయనతార
Advertisement
Ads by CJ

ఈ ఏడాది జూన్ లో నయనతార విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. నయనతార విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకోవాలంటే విగ్నేష్ శివన్ తల్లి మీనా కుమార్ నయన్ కి ఓ కండిషన్ పెట్టింది, అదేమిటంటే నయనతార విగ్నేష్ తో పెళ్లి తర్వాత ఆమె నటనకు గుడ్ బై చెప్పాలి అని, దాన్ని ఒప్పుకునే నయనతార పెళ్ళికి రెడీ అయ్యింది అంటూ పుకార్లు లేపారు. కానీ నయనతార పెళ్లి తర్వాత నటిస్తూనే ఉంది. అలాగే సరోగసి ద్వారా నయనతార-విగ్నేష్ శివన్ లు తల్లితండ్రులయ్యారు. 

అయితే నయనతార అత్తగారు, విగ్నేష్ శివన్ తల్లి నయనతారని పొగిడేస్తున్నారు. కారణం నయనతార తన ఇంట్లో పని చేసే ఒకరికి సహాయం చెయ్యడమే. విగ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి మట్లాడుతూ.. నా కొడుకు-కోడలు చాలా కష్టపడతారు. నా కొడుకు విగ్నేష్ టాప్ డైరెక్టర్, కోడలు నయన్ టాప్ హీరోయిన్, ఇద్దరిది కష్టపడే తత్త్వం. నయనతార ఇంట్లో ఎనిమిదిమంది పనివాళ్ళు ఉన్నారు. అందులో ఒకరికి నాలుగు లక్షల అప్పు ఉండగా.. దానిని నయనతార క్లియర్ చేసింది. నా కోడలు మనసు గొప్పది. తన కింద పని చేసేవాళ్ళు కష్టంలో ఉంటే.. తాను ఊరుకోదు. తన దగ్గర పని చేసేవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. 

పదిమంది చేసే పని తాను ఒకత్తే చేస్తుంది, నా కొడుకు-కోడలు ఇద్దరూ కష్టపడతారు. కష్టం విలువ ఇద్దరికి తెలుసు అంటూ నయనతారని ఆమె అత్తగారు మీనా కుమారి పొగడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Vignesh Shivan Mother Lauds Her Daughter-In-Law:

Vignesh Shivan mother Meena Kumari praises Nayanthara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ