సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 న గుండెపోటుతో తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. దానితో ఘట్టమనేని ఫ్యామిలీ శోక సముద్రంలో మునిగిపోయింది. మహేష్ బాబు తండ్రి అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తి చేసి మూడో రోజు శాస్త్రోక్తంగా చిన్న కర్మ నిర్వహించారు. ఈ చిన్న కర్మ రోజు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఏడో రోజు మహేష్ బాబు తన ఫ్యామిలీ మెంబెర్స్ అయిన గల్లా జయదేవ్, సుధీర్ బాబు, మంజుల భర్త, బాబాయ్ ఆది శేషగిరి రావు లతో కలిసి విజయవాడ వెళ్లి కృష్ణా నదిలో కృష్ణగారి అస్తికలు నిమజ్జనమ్ చేసి వచ్చాడు.
అయితే సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కర్మకి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా.. మహేష్ తన తండ్రిని తలచుకుంటూ భావోద్వేగంతో ఓ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కర్మని 13 వ రోజు ఈ ఆదివారం అంటే నవంబర్ 27 న హైదరాబాద్ లోని జెర్సీ కన్వేషన్ లో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. మహేశ్ బాబుతో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, ఇతర కుటుంబ సభ్యులు, సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే కృష్ణగారి మరణం తర్వాత పెద్ద కర్మని కృష్ణగారి స్వగ్రామం బుర్రిపాలెంలో నిర్వహిస్తారని అన్నప్పటికీ.. అది ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహించాలని ఘట్టమనేని కుటుంబ సభ్యులు తలపెట్టినట్లుగా తెలుస్తుంది.
అయితే ఈ పెద్ద కర్మకి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ అభిమానులు కూడా హాజవుతారనే టాక్ వినిపిస్తున్నా.. ఈ మేరకు పూర్తి సమాచారమైతే లేదు.