నందమూరి బాలకృష్ణ వీర సింహ రెడ్డిగా మాస్ అవతార్ లో అభిమానులకి ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతికి బాలయ్య సూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ ఫాన్స్ విపరీతమైన నమ్మకంతో ఉన్నారు. అఖండ సినిమాని గోవాలో జరుగుతున్న ఇఫిలో ప్రదర్శించిన సందర్భంగా దర్శకుడు బోయపాటి-బాలకృష్ణ లు గోవాకి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన బాలయ్య అఖండ 2 త్వరలోనే ఉంటుంది. దాని గురించి చర్చించాం, అన్ని ఓ కొలిక్కి వచ్చాక అఖండ 2 విషయమై అధికారిక ప్రకటన ఇస్తామంటూ అందరిలో ఆసక్తిని పెంచారు.
అయితే అక్కడే ఆయన మోక్షజ్ఞ ఎంట్రీ పై కూడా మాట్లాడారు. మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ఆగిపోయింది అని వస్తున్న వార్తలను బాలయ్య కొట్టిపారెయ్యడమే కాదు, మోక్షజ్ఞ తప్పకుండా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడు అని హింట్ ఇచ్చిన బాలయ్య అది ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పను. అంతా దైవేచ్ఛ అంటూ మోక్షు ఎంట్రీపై ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్ అందించారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఏ క్షణానైనా ఉండొచ్చనేది బాలయ్య మాటలకి అర్ధమై ఉంటుంది అంటున్నారు ఫాన్స్. అదే జరిగితే పండగేగా అంటున్నారు వారు.