రామ్ చరణ్ కొత్త చిత్రం RC15 తదుపరి చిత్రం RC16 అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గౌతమ్ తిన్ననూరి తో ఆగిపోయిన RC16 ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో మొదలయ్యింది. ఆ మేరకు కొత్త ప్రొడక్షన్ సంస్థ ప్రకటన ఇచ్చేసింది. రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో సతీష్ కిలారు నిర్మిస్తున్న RC 16 ని అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాల్సిన బుచ్చిబాబు ఆయన తో గ్యాప్ వస్తున్న కారణంగా రామ్ చరణ్ కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే.!
రంగస్థలం సినిమా సమయం నుంచే రామ్ చరణ్ దృష్టిని ఆకర్షించిన బుచ్చిబాబు తన స్టోరీ నేరేషన్ తో చరణ్ ని బాగా ఇంప్రెస్ చేసాడట. ఇక గురువైన దిగ్దర్శకుడు సుకుమార్ ఆశీస్సులు, అండదండలు ఎలాగూ ఉండనే ఉన్నాయ్. దాంతో చకచకా ట్రాక్ ఎక్కేసిన ఈ ప్రాజెక్ట్ నేడు అధికారిక ప్రకటన వరకు వచ్చేసింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగే టిపికల్ స్టోరీకి బుచ్చిబాబు అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసాడనేది ఇన్ సైడ్ టాక్. అలాగే రామ్ చరణ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందని, చరణ్ ఆల్రెడీ ఆ మేక్ ఓవర్ టాపిక్ కూడా సుకుమార్, బుచ్చిబాబులతో డిస్కస్ చేసాడని సమాచారం.
భారీ స్థాయిలో పాన్ ఇండియా ఫిలింగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంస్థల భాగస్వామ్యంతో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు.
నేడు అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే అందరిలో ఆసక్తిని పుట్టించి, అంచనాలను మొదలు పెట్టించిన ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మరో అప్ డేట్ లో..!
Excited about this !!
— Ram Charan (@AlwaysRamCharan) November 28, 2022
Looking forward to working with @BuchiBabuSana & the entire team.@vriddhicinemas @SukumarWritings #VenkataSatishKilaru @MythriOfficial pic.twitter.com/hXuI5phc7L