బిగ్ బాస్ సీజన్ 6 లో టైటిల్ ట్రోఫీ ఎవరికీ వెళ్లబోతుందో అనేది డిసైడ్ అయ్యిపోయింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరూ ఎవరు విన్నర్ అవుతారో అనేది చెప్పెయ్యడమే కాదు, బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన హౌస్ మేట్స్ స్నేహితులు కూడా ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేసారు. అదే రేవంత్ పేరు. బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుండే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మిగతా వారికి చుక్కలు చూపిస్తున్న రేవంత్ ని మిగతా కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ పై మీ వాళ్ళకి ఎవరు పోటీ అని నాగ్ అనగానే ప్రతి ఒక్కరూ రేవంత్ ఫోటో పెట్టడం, నీకేంటి నీకు విపరీతమైన క్రేజ్ ఉంది అనడం చూసిన మరో కంటెస్టెంట్ ఆది రెడ్డి తట్టుకోలేకపోతున్నాడా.. అనిపించేలా ఈరోజు రేవంత్ ని నామినేషన్స్ లో టార్గెట్ చేసాడు ఆది రెడ్డి.
రేవంత్ నీ వీడియో నాగ్ సర్ చూపించకముందు నువ్వేమన్నావో అనే వీడియో కూడా చూపిస్తే బావుండేది. నీ అసలు రూపం నీమనసులో ఏమున్నదో, లేడీ కంటెస్టెంట్స్ వీక్ అనే భావన అర్ధమయ్యేది అంటూ ఆది రెడ్డి రేవంత్ ని నామినేట్ చేసాడు. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, నేను నాగ్ సర్ వీడియోని నమ్ముతున్నా, నువ్ అలంటి వాడివో నాకు తెలుసు వదిలేయ్ అంటూ రేవంత్ కూడా స్ట్రాంగ్ గానే స్పందించాడు. రేవంత్ తోనే కాదు ఆది రెడ్డి శ్రీహన్ తోనూ గొడవపడ్డాడు.
శ్రీహన్ బిగ్ బాస్ కి 1 లాక్ చెక్ విషయంలో నాకు రూపాయి అయినా, అర్ధ రూపాయైనా ఇంపార్టెంట్ అన్నాడు. కానీ ఆది రెడ్డి దానికి ఒప్పుకోకుండా వాదించాడు. సెన్స్ అంటే ఫీలైన శ్రీహన్ కామన్ సెన్స్ అనే పదం ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆది రెడ్డి శ్రీహన్ కి కౌంటర్ వేసిన ప్రమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.