కమెడియన్, నటుడు అలీకి ఈ మధ్య అన్నీ చక్కగా కలిసివస్తున్నాయి. టైమ్ వస్తే ఏదీ ఆగదు అనేదానికి నిదర్శనంగా ప్రస్తుతం అలీని చూపించవచ్చు. సడెన్‌గా ఏపీ ముఖ్యమంత్రి పిలిచి మరీ పదవి ఇవ్వడం, అదే సమయంలో తన కుమార్తె పెళ్లి.. ఇలా అలీ ఇంట్లో సంతోషం రెట్టింపు అయింది. పదవి సంగతి పక్కన పెడితే.. అలీ కుమార్తె ఫాతిమా వివాహమాడిన షెహ్యాజ్ గురించి తెలిసిన వారంతా.. ఇప్పుడు షాక్ అవుతుండటం విశేషం. ప్రస్తుతం ఫాతిమా డాక్టర్ కోర్స్ చేస్తున్నట్లుగా రీసెంట్‌గా అలీనే చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు కూడా డాక్టరే కావడం విశేషం.
అలీ అల్లుడైన షెహ్యాజ్.. జమీలా బాబీ, జిలానీ భాయ్‌ల రెండో కుమారుడు. మొదటి కుమారుడి భార్య అంటే.. షెహ్యాజ్ వదిన కూడా డాక్టరే అని తెలుస్తుంది. ఈ ఫ్యామిలీది ఒరిజినల్ ప్లేస్ గుంటూరే అయినప్పటికీ.. ప్రస్తుతం వారంతా లండన్‌లో నివసిస్తున్నట్లుగా సమాచారం. మంచి ఎడ్యుకేషన్ ఉన్న ఫ్యామిలీనే కాకుండా.. బాగా రిచ్ ఫ్యామిలీ అని కూడా తెలుస్తోంది. ఇప్పుడు అలీ కుమార్తె కూడా డాక్టరే చదువుతుండటంతో.. ఈ ఫ్యామిలీలో మరో డాక్టర్ యాడ్ అయినట్లు అయింది. మంచి ఫ్యామిలీ, డాక్టర్స్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ కావడంతో.. ఇంకేం ఆలోచించకుండా.. తన కుమార్తె వివాహాన్ని అలీ అంగరంగ వైభవంగా జరిపించారు. టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే.