బిగ్ బాస్ సీజన్ 6 చివరి మూడు వారాల్లోనూ ఆటని ఆసక్తిగా మార్చడానికి బిగ్ బాస్ ట్రై చేస్తున్నాడు. అందుకే టికెట్ టు ఫినాలే టాస్క్ లో రకరకాల టాస్క్ లతో కంటెస్టెంట్స్ మధ్యన ఫైర్ పుట్టించాడు. అందులో భాగంగా మొదటి టాస్క్ లో సత్య ఎలిమినేట్ అవ్వగా.. ఇనాయ, కీర్తి, రేవంత్, ఆది రెడ్డి, శ్రీహన్ , రోహిత్, ఫైమా లు సెకండ్ టాస్క్ కోసం పోటీ పడగా.. అందులో ఇనాయ, కీర్తి ఎలిమినేట్ అయ్యారు. అయితే శ్రీ సత్య-కీర్తి- ఇనాయలకు మరో ఛాన్స్ ఇస్తూ టికెట్ టు ఫినాలే కోసం కలర్స్ టాస్క్ పెట్టాడు. అందులో శ్రీ సత్య ముందుగా అవుట్ అవ్వగా.. ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తే ఇలానే ఉంటుంది అని ఎమోషనల్ అయ్యింది.
తర్వాత ఆ టాస్క్ లో ఇనాయ-కీర్తి పోటాపోటీగా ఆడినప్పటికీ.. చిన్న తేడాతో ఇనాయ ఎలిమినేట్ అయ్యింది. తర్వాత బిగ్ బాస్ మరో టఫ్ టాస్క్ పెట్టాడు. అందులో అందరూ బాగానే ఆడారు. కానీ ఆరుగురిలో ఏకాభిప్రాయంతో నలుగురు మాత్రం ఫైనల్ టాస్క్ కి వెళ్లాలని బిగ్ బాస్ రూల్ పెట్టడంతో.. అందరూ బిగ్ బాస్ కి ఎదురు తిరిగారు. టాస్క్ ఇవ్వండి కష్టపడి ఆడతాం, అంతేకాని ఇలా ఏకాభిప్రాయం పెట్టకండి అని రోహిత్ అన్నాడు. ఆది రెడ్డి కూడా బిగ్ బాస్ ఏకాభిప్రాయం వద్దన్నాడు.
రేవంత్ అయితే బిగ్ బాస్ ఏకాభిప్రాయంతో నాలుగుసార్లు కెప్టెన్సీ కంటెండర్ అయ్యి కెప్టెన్సీ పోగొట్టుకున్నాను అన్నాడు. ఇక శ్రీహన్ అయితే నాకు ఈ టికెట్ టు ఫినాలే చాలా ఇంపార్టెంట్. నాకు ఖచ్చితంగా రావాల్సిందే. ఒకవేళ ఏకాభిప్రాయంతో నన్ను వేరైనా తీసివేస్తే.. ఇక్కడున్న ఒక్క ప్లేట్ కూడా మిగలదు. ఎవ్వరికి ఆడనివ్వను, రానివ్వను అంటూ ఫైర్ అయ్యాడు. దానితో రోహిత్, రేవంత్ షాకయిన ప్రోమో వైరల్ అయ్యింది.