నీకు చెల్లెలు ముఖ్యమా లేదంటే వేరేవాళ్ళ పెళ్లి ముఖ్యమా అని అడుగుతున్నది ఎవరో కాదు నెటిజెన్స్, ప్రజలు. నాకైతే చెల్లె ముఖ్యమని చెబుతాం అంటూ పలువురు చెబుతున్న మాట. ఇది ఏపీ సీఎం జగన్ గారిని ఏపీ ప్రజలే కాదు, ఆఖరికి తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నిన్న జగన్ చేసిన పనే అందరూ వేలెత్తి చూపించేలా చేసింది. తనకి భజన చేసేవారే ముఖ్యం.. కుటుంబం కాదు, రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు అంతకన్నా కాదు అని తేల్చేసాడు వైఎస్ జగన్. ఎంతగా చెల్లెలితో తత్సంబంధాలు కొనసాగించకపోయినా.. చెల్లెలు కష్టంలో ఉంది అంటే కోపాన్ని పక్కనబెట్టి కదలాలి.
కానీ జగన్ గారు చెల్లెలు ముఖ్యం కాదు, నాకు నా భజన చేసే వారే ముఖ్యమని నిరూపించారు. నిన్న మంగళవారం షర్మిలని తెలంగాణ పోలీస్ లు ట్రాఫిక్ అంతరాయం కలిగించారన్న కారణంగా కారుతో పాటుగా అరెస్ట్ చేసి SR నగర్ పీఎస్ కి తరలించగా, షర్మిల తల్లి విజయమ్మ కూతురు దగ్గరకి రావడానికి ప్రయత్నం చేసింది. కాని ఆమెని హౌస్ అరెస్ట్ చేసారు. రాజకీయంగా ఎంత హై డ్రామా జరిగినా, చెల్లెలు అరెస్ట్ అయ్యింది అంటే అన్న ఊరుకుంటాడా.. అస్సలు ఊరుకోరు. కానీ జగన్ గుంటూరు లోనే ఉన్నారు, కానీ ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చెల్లిని పలకరించలేదు. ఒకసారి రావాల్సింది.. వచ్చి ఆమెని పరామర్శించాల్సి అంటున్న నెటిజెన్స్.
తన కి భజన చేసే కమెడియన్, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ కూతురు ఫాతిమా రిసెప్షన్ కి గుంటూరు వెళ్లి అక్కడ హడావిడి చేసాడు. కనీసం జగన్ మాట మాత్రమైన చెల్లెలిని పరామర్శించలేదు. అందుకే నెటిజెన్స్ డైరెక్ట్ గానే.. జగన్ నీకు చెల్లెలి కన్నా నీ భజనాపరుల పెళ్లి ముఖ్యమా అంటూ నిలదీస్తున్నారు.