Advertisementt

నారా బ్రాహ్మణి సీక్రెట్ రివీలైపోయింది

Thu 01st Dec 2022 12:29 PM
nara brahmani,leh,ladakh  నారా బ్రాహ్మణి సీక్రెట్ రివీలైపోయింది
Nara Brahmani enjoys bike trip in Leh Ladakh నారా బ్రాహ్మణి సీక్రెట్ రివీలైపోయింది
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు కూతుళ్లు ఎప్పుడూ పబ్లిక్ లో ఎక్కువగా కనిపించే సెలెబ్రిటీ కిడ్స్. చిరు పెద్ద కూతురు కాస్ట్యూమ్స్ డిజైనర్, చిన్న కూతురు శ్రీజ అందరికి తెలిసిన అమ్మాయి. అయితే నందమూరి బాలకృష్ణ కుమార్తెలు మాత్రం ఎక్కువగా పబ్లిక్ లో కనిపించరు. నందమూరి ఇంటి నుండి నారా వారి ఇంటికి కోడలిగా వెళ్లిన నారా బ్రాహ్మణి సీఎం కి కోడలైనా చాలా సింపుల్ గా ఉంటుంది. ఆమె యువ వ్యాపారవేత్త. చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి. ఎక్కువగా మీడియాలో కనిపించదు. టిడిపి అధ్యక్షుడి హోదాలో నారా లోకేష్ ఉన్నప్పటికీ.. నారా బ్రాహ్మణి ఎక్కువగా రాజకీయాల్లో తలా దూర్చదు. తన వ్యాపారాలు, తన ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటుంది.

అయితే నారా బ్రాహ్మణిలో చాలా టాలంట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆమె బైక్ రైడర్ అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఉన్నట్టుండి బ్రాహ్మణి బైక్ రైడింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆమె ప్రొఫెషనల్ గ్రూప్ మెంబెర్ అవడంతో బ్రాహ్మణిలో ఇలాంటి టాలెంట్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఎప్పటినుంచో బ్రహ్మణికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట. తాజాగా బ్రాహ్మణి లేహ్ నుండి లఢక్ వరకు బైక్ రైడింగ్ కి వెళ్ళిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో.. అది ఇప్పుడు విపరీతంగా వైరల్ అయ్యింది.

బ్రాహ్మణి బైక్ రైడర్ అని తెలిసాక నందమూరి, నారా వారి అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. కొందరైతే ఇక్కడ ఎవరూ.. బాలయ్య బాబు కూతురు. అన్ని టాలెంట్స్ వాళ్ళ సొంతం అంటూ కాలర్స్ ఎగరేస్తున్నారు.

Nara Brahmani enjoys bike trip in Leh Ladakh:

Nara Brahmani bike riding at Leh in Ladakh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ